Nellore Murder Case: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో జరిగిన హత్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీన జరిగిన ఘటన దారుణం, దురదృష్టకరం.. డబ్బులు అడిగే విషయంలో బ్రూటల్ గా హత్య చేశాడు.. ఈ కేసులో నిందితుడు హరి చంద్రప్రసాద్ ను అతని తండ్రిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపటం జరిగింది.. బాధిత మహిళకు, అతని తల్లిదండ్రులకు న్యాయం జరగాలని సూచించారు. హత్య జరిగిన నాటి నుంచి ప్రభుత్వం ఫాలో చేస్తుంది.. హత్యకు సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కమిటీ వేయటం జరిగింది.. నిందితుడికి బెయిల్ రాకుండా శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇది ఒక భార్యాబిడ్డల ఆవేదన, తల్లిదండ్రుల ఆవేదన అని మంత్రి అనిత తెలిపింది.
Read Also: Bhatti Vikramarka : విద్యపై రాజీ లేదు…అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య
ఇక, మీకు దండం పెడతాం.. ఈ హత్య కేసును రాజకీయం చేయొద్దు అని మంత్రి అనిత కోరింది. దీనిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చి శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయినా ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తామన్నారు. హత్య జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి పంపించాలి.. అందుకే అరెస్టు చేయటం ఆలస్యం అయ్యింది.. బాధితురాలిని ఆదుకునే విషయం పక్కనపెట్టి శవ రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడింది. క్రిమినల్స్ కు కులం మతం ఉండదు.. క్రిమినల్ ను క్రిమినల్ గానే చూస్తామన్నారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది.. మేము నివేదిక ఇస్తున్నాం.. నివేదిక ప్రకారం ప్రభుత్వం సాయం చేస్తుందని వంగలపూడి అనిత వెల్లడించింది.
