Panchayat Polls: తొలి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా.. బీఆర్ఎస్, బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panchayat Polls: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 3,836 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగ్గా కాంగ్రెస్ 2,383 బీఆర్ఎస్ 1,146, బీజేపీ 181, ఇతరులు-455 సీట్లను కైవసం చేసుకున్నారు. మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉండగా.. బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. మరోవైపు.. బీజేపీ కంటే ఇతరులకు ఎక్కువ సీట్లు రావడం గమనార్హం. తొలి విడతలో మొత్తం పోలింగ్ శాతం 84.28 కాగా.. యాదాద్రిలో అత్యధికంగా 92.88 శాతం పోలింగ్ నమోదైంది. తొలి ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు.. జిల్లాలో ఈనెల 14న జరిగే రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారాలు శుక్రవారం సాయంత్రంతో ముగియనున్నాయి. ఏకగ్రీవాలు మినహాయించి మిగతా చోట్ల గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ హామీలు గుప్పించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం వినూత్న రీతిలో ప్రచారం సైతం నిర్వహించారు. రెండో దశ పోలింగ్‌లో ఎవరు సత్తా చాటనున్నారో తెలియాల్సి ఉంది.
READ MORE: Effects of Lack of Sleep: నిద్రలేమితో బరువు పెరుగుతారని మీకు తెలుసా..
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
కాగా.. తొలి విడతలో ఆసక్తికర విషయం ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠానా ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.. గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన అభ్యర్థి సర్పంచిగా గెలుపొందారు.. వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ ఠానా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెర్ల మురళి తన సమీప ప్రత్యర్థి పై 370 ఓట్లతో గెలుపొందారు.. కానీ.. చెర్ల మురళి ఈనెల 5వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు.. మొత్తం 1717 ఓట్లు పోల్ కాగా, బీఆర్ఎస్ చెర్ల మురళి 739, బీజేపీ సురువు వెంకటి 369, కాంగ్రెస్ కోలాపురి రాజమల్లు 333 ఓట్ల వచ్చాయి. మరోవైపు.. ఉప వార్డు సభ్యులు సర్పంచ్‌గా కుమార్‌ను ఎన్నుకున్నారు. గెలిచిన అభ్యర్థి మృతి చెందడంతో సర్పంచ్ ఎన్నికను ప్రకటించకుండా ఎలక్షన్ కమిషన్‌కు పంపిస్తామని అధికారులు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. దీంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ మొదలైంది.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్పై సౌతాఫ్రికా విజయం.!