జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.. జగన్‌ను చూసేందుకు వెళ్తూ ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చేశారంటూ వైసీపీ నేతలపై దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.. ఇప్పటికే ప్రసన్నకుమార్ రెడ్డిపై రెండు కేసులు నమోదు అయ్యాయి.. అనుమతులు లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారని వైసీపీ నేతలపై మరో కేసు నమోదు కాగా.. ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేశారు దర్గామిట్ట పోలీసులు..
వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై హాట్ కామెంట్లు చేశారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత.. సీఎం చంద్రబాబు బావిలో దూకాలన్న జగన్ కామెంట్లుకు కౌంటర్ ఇచ్చిన ఆమె.. చంద్రబాబు బాయిలో దూకడం కాదు జగన్.. నువ్వు నీరు లేని బావిలో పడ్డా.. నీ పాపాలు పోవు అని వ్యాఖ్యానించారు.. సూట్ కేసు రెడీ చేసుకుని ఉండు... త్వరలో జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పరిటాల సునీత..
నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించడానికి వెళ్తుండగా.. హరిత హోటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు.. నల్లపురెడ్డి కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో.. కార్యకర్తలు దూసుకురాగా.. వైసీపీ కార్యకర్తల మీద లాఠిఛార్జ్ చేశారు పోలీసులు.. దీంతో, రోడ్డుమీద బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి..
వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన కాసేపట్లో ప్రారంభంకానుంది. జనసమీకరణ చేయొద్దని పోలీసులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల నడుమ వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన కొనసాగనుంది. తాడేపల్లిలోని నివాసం నుంచి నెల్లూరు చేరుకుంటారు జగన్. సెంట్రల్ జైల్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శిస్తారు. తర్వాత కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తారు జగన్. కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు