Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..

Pk And Cbn

Pk And Cbn

Chandrababu, Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యా్‌ణ్‌ ఇవాళ నెల్లూరు జిల్లాలో ప్యటించనున్నారు.. ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలోని రామాపురంలో నిర్వహించనున్న పల్లె పండగ 3.0 కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ రామాపురానికి రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ రామాపురానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పల్లె పండగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ.11,085 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ శ్రీకారం చుట్టనున్నారు. కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.

అయితే, ఈ రోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి నేరుగా ఉదయగిరి నియోజకవర్గంలోని రామాపురం వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఇక, ఇప్పటికే అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యా్‌ణ్‌.. ఈ పర్యటనలో రామాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. సోమవారం రోజు పరిశీలించారు.. రామాపురంలో నిర్వహించే సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్‌, తాగునీరు, విద్యుత్‌, పారిశుద్ధ్యం.. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్న ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు..