Prasanna vs Prashanthi: కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి కలకలం సృష్టించింది. నెల్లూరు నగరంలోని సావిత్రి నగర్‌లోని ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలోకి చొరబడి దుండగులు.. అల్లకల్లోలం చేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలకొట్టి దాన్ని తలకిందులుగా పక్కకి తోసేసారు. ఇంటి రూపు రేఖలే మార్చేశారు. దాడి జరిగిన టైంలో ప్రసన్నకుమార్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మమ్మతోపాటు.. పని మనుషులు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. అప్పటికే ఇల్లంతా గందరగోళంగా మారింది. ప్రసన్న ఇంటిపై దాడి జరిగిందని సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ శ్రేణులు ఆయన నివాసానికి చేరుకున్నారు. దాడిని తీవ్రంగా ఖండించారు. జిల్లాలో ఈ తరహా రాజకీయాలు గతంలో ఎన్నడూ లేవంటూ వైసీపీ నేతలు అన్నారు. అటు ప్రసన్నకుమార్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు వైసీపీ అధినేత జగన్. అసలేం జరిగిందని ఆరా తీశారు.
Read Also: Tamil Nadu: ఘోర విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రైన్.. ఇద్దరు విద్యార్థుల మృతి
అయితే, ఈ దాడి వెనక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వున్నారని ప్రసన్న కుమార్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ వ్యక్తిగత విమర్శలు చేశారని టీడీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి ప్రశాంతి రెడ్డి పెళ్లి చేసుకున్నారంటూ ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాకరేపాయి. VPR ని చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఆయన అప్రమత్తంగా ఉండాలని కోవూరు నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్న వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి.
Read Also: Bellamkonda : మరో రీమేక్ చేస్తున్న బెల్లంకొండ.. రీమేక్ స్టార్ అని ట్రోల్స్..
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసని వ్యాఖ్యానించిన ప్రసన్నకుమార్ రెడ్డి.. ఎవరూ దొరకనట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆమెను పెళ్లి చేసుకున్నారు.. ఆయన కోరితే ఒక కన్నెపిల్లను తెచ్చి నేనే పెళ్లి చేసేవాడిని.. పదేళ్ల క్రితం నువ్వు ఎక్కడున్నావ్? ఆ ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెబుతున్నా. నీ దగ్గర రూ.వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి.. జాగ్రత్తగా ఉండాలి నువ్వు.. ఇప్పటికే నిన్ను చంపటానికి రెండు సిట్టింగ్ లు అయ్యాయని నా దగ్గర సమాచారం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ.. రేణిగుంట మెస్ లో పీహెచ్‌డీ నేర్చుకున్నావు.. తిరుపతిలో పీహెచ్ డీ నేర్చుకున్నావు.. బెంగళూరు పీహెచ్‌డీ చేశావు.. హైదరాబాద్ లో పీహెచ్‌డీ చేశావు. మద్రాసులో పీహెచ్‌డీ చేశావు.. చివరకు మాగుంట లేఅవుట్‌లోనూ పీహెచ్‌డీ చేశావు. చివరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్ మొయిల్ చేసి పెళ్లి చేసుకున్నావు అంటూ వ్యక్తిగత దూషణలకు దిగిన ఆయన.. ప్రశాంతిరెడ్డి చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు. విడిపోయిన తర్వాత ఏపీ మొత్తం తెలుసు. పక్క రాష్ట్రంలోనూ చెబుతారని.. కాశీలో.. గుజరాత్ సూరత్‌లోనూ ఆమె గొప్పతనం గురించి చెబుతారు అంటూ కామెంట్ చేశారు..
Read Also: YSR Jayanthi 2025: ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జగన్
అయితే, ఈ కామెంట్స్ చేసిన సరిగ్గా గంటన్నర తరువాత నెల్లూరులోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. దీంతో ప్రశాంతి రెడ్డి అనుచరులే దాడికి పాల్పడ్డారని ప్రసన్న కుమార్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు… దుండగులు ఎవరు.. వారి వెనక ఎవరున్నదానిపై విచారణ చేస్తున్నారు.
