NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: నేటికి వాయిదా పడిన కాకాణీ గోవర్థన్ రెడ్డి పోలీసుల విచారణ..

Kakani

Kakani

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణీ గోవర్థన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈరోజు (ఏప్రిల్ 1న) నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, నిన్న (మార్చ్ 31న) విచారణకు గైర్హాజరైన కాకాణి.. నెల్లూరు, హైదరాబాద్ లలోని నివాసాలలో అందుబాటులో లేకపోవడంతో అతడి కోసం పోలీసుల గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

Read Also: Keerthi Suresh : బాలీవుడ్ లో మరో ఆఫర్ అందుకున్న కీర్తి సురేష్..

అయితే, ఈ రోజు మాజీ మంత్రి కాకాణీ గోవర్థన్ రెడ్డి విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తామంటున్నారు పోలీసు అధికారులు. దీంతో పాటు నేడు ఏపీ హైకోర్టులో కాకాణీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. అదే విధంగా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కాకాణీ వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ కూడా న్యాయస్థానం చేయనుంది.