India-Canada: భారత్ పై కెనడా అనుసరిస్తున్న వైఖరిపై, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై భారత్ పొరగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ స్పందించాయి. ఆధారాలు లేకుండా భారత్ పై ఆరోపణలు చేసిన జస్టిన్ ట్రూడో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా పార్లమెంట్ లో మాట్లాడిన ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో, ఇందులో భారత ప్రమేయం ఉందంటూ ఆరోపించారు.
శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ఓ ఆంగ్ర పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధాని ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. కొందరు ఉగ్రవాదులకు కెనడా సురక్షిత అడ్డాగా మారిందని విమర్శించారు. కెనడా ప్రధాని గతంలో ఇలాంటి ఆరోపణలనే శ్రీలంకపై కూడా చేశారు. మా దేశంలో ఎలాంటి హత్యాకండ జరగలేదని అందరికీ తెలుసు.. బలహీనమైన ఆరోపణలతో ట్రూడో ముందుకు రావడాన్ని చూసి నేనేమీ ఆశ్చర్యపోలేదు, నాజీలతో కలిసి పనిచేసిన వారికి ట్రూడో స్వాగతం పలకడం నిన్న చూశామని ఆయన అన్నారు.
Read Also: Armenia: ఆర్మేనియా గ్యాస్ స్టేషన్‌లో పేలుడు.. 20 మంది మృతి, 300 మందికి గాయాలు…
బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమిన్ కూడా కెనడా ప్రధాని ఆరోపణలను తప్పుపట్టారు. అపరిపక్వతతో ఈ ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడ్డారు. ఈ వివాదం త్వరలోనే ముగిసిపోవాలని ఆయన ఆశించారు.
జూన్ నెలలో ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) ఉగ్రసంస్థ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ ను గుర్తుతెలియని వ్యక్తులు కెనడాలోని సర్రేలోని గురుద్వారా వద్ద కాల్చి చంపారు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే కెనడా ఒక భారత దౌత్యవేత్తను బహిష్కరించింది. ఇందుకు ప్రతిగా భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడా ఆరోపణల్ని అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా ఇండియా ఖండించింది.