NTV Telugu Site icon

Somu Veerraju: పోలవరం ప్రాజెక్టుకు మేం బాకీలేం.. చర్చకు సిద్ధం..

Somu Veerraju

Somu Veerraju

ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కేంద్రం ఏం చేసిందన్న దానిపై.. మేము చర్చకు సిద్ధమని సవాల్‌ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు మేం (కేంద్ర ప్రభుత్వం) బాకీలేము… ఆ ప్రాజెక్టును భ్రష్టుపట్టించారని మండిపడ్డారు.. పోలవరాన్ని కేంద్రం కట్టించి ఉంటే ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేది.. కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని ఆరోపించారు సోమువీర్రాజు… ఇక, ఈ సమయానికే పోలవరం పూర్తి అయిఉంటే మిగులు జలాలతో రాయలసీమకు న్యాయం జరిగేదన్నారు.. మరోవైపు, అమలాపురం జిల్లాలో రైతులు క్రాప్ హాలిడేకి కారణం ప్రభుత్వ వైఖరే అని మండిపడ్డారు సోమువీర్రాజు.. ఈనెల 22 నుంచి 29 వరకు ఏడు రోజులు ఆజిల్లాలో పోరాటం చేస్తామని ప్రకటించారు.. యువ సంఘర్షణ యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 2 నుంచి 14 వరకు నాలుగు జోన్లలో చేపడతామన్నారు.

Read Also: Pratap Pothen : ప్రముఖ నటుడు ప్రతాప్ పోతన్ కన్నుమూత

మరోవైపు.. గోదావరి వరదలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి.. దీంతో.. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో బీజేపీ పర్యటనలు చేయాలని నిర్ణయించింది.. ముంపు ప్రాంతాల్లో పర్యటనకు రెండు కమిటీలను నియమించారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. తూర్పు గోదావరి, అంబేద్కర్ జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బృందం… ఇక, పోలవరం విలీన మండలాల్లో పర్యటించనుంది ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి బృందం… క్షేత్ర స్థాయిలో పర్యటనల అనంతరం పార్టీకి నివేదిక సమర్పించాలన్న సోము వీర్రాజు సూచించారు.