విజయవాడ ఉంగటూరు పోలీస్ స్టేషన్ ఉంగటూరు పోలీస్ స్టేషన్ నుండి సోము వీర్రాజు విడుదల అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ దెబ్బకి వైసీపీ ప్రభుత్వం, మంత్రి ఓడిపోయాడన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మమ్ముల్ని ఆపాలని చూశారు. సంక్రాంతి సంబరాలు ఎలా జరపాలో మా కార్య కర్తలు గుడివాడ నానికి చూపించారని చురకలు అంటించారు. ఢిల్లీలో తోకలు పట్టుకుని తిరిగే పార్టీలు మాపై కామెంట్లు చేస్తున్నాయన్నారు. మాది తోక పార్టీ కాదని, ఉనికి లేని పార్టీ అని కామెంట్లు చేసే వారు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని సోము వీర్రాజు అన్నారు. మేము ప్రచారం కోసం రాలేదన్నారు. గోవా వాళ్లతో ప్రచారం చేసుకుంది వైసీపీ ప్రభుత్వమేని ఎద్దేవా చేశారు.
Read Also: ఏపీలో కొత్తగా 13,819 కరోనా కేసులు
వైసీపీకి కొడాలినానికి సంక్రాంతిఎలా చేయాలో చూపించామని విమర్శించారు. బీజేపీనీ చూసి సంక్రాంతి ఎలా చేయ్యాలో నేర్చుకోవాలన్నారు. పోలీస్ లపై ప్రభుత్వ ఒత్తిడి ఉంది..అందుకే మమ్మల్ని అడ్డుకున్నారు.మాది తోక పార్టీ కాదు కోరలు ఉన్న పార్టీ. ఒక్క రోడ్డు కూడా వేయలేని ప్రభుత్వం వైసీపీ ..వేల కోట్ల తో రోడ్లు వేస్తున్న పార్టీ బీజేపీ అంటూ వ్యాఖ్యానించారు. మతతత్వ వాదంతో వైపీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. హిందువుల డబ్బుతో చర్చిలు కట్టిస్తుంది.ఉనికి లేని మా పార్టీ గురించి భయమెందుకు… ఉలుకెందుకు.. పెగ్గు వేసుకుని రగ్గు కప్పుకోని పడుకోండి అంటూ దుయ్యబట్టారు. పోలీసులను అడ్డు పెట్టుకుని మముల్ని ఆపడానికి కొంచమైనా సిగ్గుండాలని సోము వీర్రాజు విమర్శించారు.