Site icon NTV Telugu

వైసీపీ, టీడీపీ కలవడం ఆశ్చర్యం..! సోమువీర్రాజు ఫైర్‌

Somu Veerraju

Somu Veerraju

ఇవాళ జరిగిన భారత్ బంద్‌పై సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… రైతుల కోసం జరిగిన బంద్‌లో రైతులు ఎవరూ పాల్గొనలేదని విమర్శించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బంద్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలవడం ఆశ్చర్యకరమైన విషయం అంటూ మండిపడ్డారు.. ఇక, వైసీపీ, టీడీపీ.. పార్లమెంట్‌లో కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లులకు ఎందుకు మద్దతు తెలిపాయి? అని ప్రశ్నించారు సోము వీర్రాజు.. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి నష్టం లేదన్న ఆయన.. పంజాబ్, మహారాష్ట్రల్లో కొంత మంది పెట్టుబడి పెట్టి ఉద్యమాలు నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఏదో విధంగా నిందలు వేయడమే విపక్షాల పనిగా పెట్టుకున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సోము వీర్రాజు.

Exit mobile version