Site icon NTV Telugu

Somu Veerraju: ఏపీ రాజధాని అమరావతే.. సీఎం విశాఖకు పారిపోతున్నారు..!

Somu Veerraju

Somu Veerraju

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తామని స్పష్టం చేశారు.. అయితే, విపక్షాలు మాత్రం.. అమరావతే రాజధాని అని చెబుతున్నాయి.. మరోసారి రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన ఆయన.. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తాం అని ప్రకటించారు.. అమరావతి రాజధాని అనే ఉద్దేశ్యంతోనే బెజవాడలో మూడు ఫ్లైఓవర్లు కట్టామని గుర్తుచేశారు. అమరావతే రాజధాని కాబట్టే.. ఇక్కడ అభివృద్దికి నిధులు కేటాయిస్తాం అన్నారు.

Read Also: Nothing Phone (1): రూ.32 వేల స్మార్ట్‌ఫోన్‌.. ఇప్పుడు రూ.1,999కే మీ సొంతం..!

అమరావతే రాజధాని.. ఇక్కడే ఇల్లు నిర్మించుకున్నానని గతంలో వైఎస్‌ జగన్‌ చెప్పారని గుర్తుచేశారు సోము వీర్రాజు.. అయితే, ఇప్పుడు జగన్ అమరావతిని వదిలి విశాఖకు పారిపోతున్నారంటూ హాట్‌ కామెంట్లు చేశారు.. విశాఖను వైఎస్‌ జగన్ అభివృద్ధి చేసేదేంటీ..? అని నిలదీశారు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. లక్ష కోట్లతో అభివృద్ధి జరుగుతోంది.. జగన్ విశాఖ అభివృృద్ధి కోసం రూ. 200 కోట్లు కూడా కేటాయించ లేదని మండిపడ్డారు.. మాకు దమ్మున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.. మిగిలిన పార్టీల్లో ఉన్నట్టు.. డబ్బున్న వాడో.. హత్యలు చేసేవారో మాకు నాయకుడిగా లేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.

Exit mobile version