Somu Veerraju Fires On Chandrababu Naidu Nara Lokesh: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారాలోకేష్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన పాదయాత్రలో భాగంగా రాయలసీమను అభివృద్ధి చేస్తామని లోకేష్ హామీలు ఎలా ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. 14 సంవత్సరాల పాటు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటికీ.. రాయలసీమకు ఏమీ చెయ్యలేదని దుయ్యబట్టారు. మళ్లీ రాయలసీమను అభివృద్ధి చేస్తామంటే, ప్రజలు నమ్మరని తేల్చి చెప్పారు. నంద్యాలలో బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయిన తర్వాత సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్లు వేసింది కేంద్రంలో ఉన్న తమ బీజేపీ ప్రభుత్వమేనని, రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. ఏపీలో తాము అభివృద్ధి చేస్తే.. జగన్ సర్కార్ తమ స్టిక్కర్లు వేసుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా లేవని, ఎంపీ ఫ్యామిలీనీ కిడ్నాప్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు.
Mummy Found: కొండపై కోకా ఆకులతో చుట్టబడిన మమ్మీని కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్తలు
అంతకుముందు కూడా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని.. అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. చివరికి.. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో కూడా కుంభకోణాలకు పాల్పడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా కేంద్రాలను దోపిడీ కేంద్రాలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్చేసిందని.. మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనివల్ల రైతుకు గిట్టుబాటు ధర దక్కకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులు తినని బియ్యాన్ని మిల్లర్లు అందిస్తున్నారని.. ప్రభుత్వం కళ్లు మూసుకున్నట్లుగా వ్యవహరిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర పెంచినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని.. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పేదల కోసం ఇళ్లు నిర్మించటానికి కొనుగోలు చేసిన భూముల్లో.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు. చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీ, స్పిన్నింగ్ మిల్లులను ఎందుకు మూసివేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
Manipur Violence: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు..!