NTV Telugu Site icon

Rajahmundry Arts College: అక్కడ క్రికెట్ స్టేడియం నిర్మించొద్దు..!

Somu Veerraju

Somu Veerraju

రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో క్రికెట్ స్టేడియం నిర్మించాలనే యోచన రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి లేఖ రాయనున్నట్టు తెలిపారు.. ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ అయితే భవన నిర్మాణాలు ఎక్కడ కడతారు ? అని ప్రశ్నించిన ఆయన.. ల్యాబ్స్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని సూచించారు. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ను పరిశీలించిన సోము వీర్రాజుకు క్రికెట్ స్టేడియం నిర్మాణం చేయకుండా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేసింది ఏబీవీపీ విద్యార్థి సంఘం.. ఇక, రాజమండ్రి సెంట్రల్ జైలు స్థలంలో రెండున్నర ఏకరాలు వైసీపీ కార్యాలయానికి కేటాయించాలని కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సోము వీర్రాజు.. వైసీపీ కార్యాలయానికి కావాలంటే ప్రైవేటు స్థలం కొనుగోలు చేసుకోండి… మేం అంతా అలాగే కొనుక్కున్నాం.. కానీ, ఇలా అడ్డదారిలో భూమి కేటాయిస్తే ఊరుకునేది లేదంటూ ఫైర్‌ అయ్యారు సోము వీర్రాజు.

Read Also: Breaking: రాజ్యసభకు ఆర్‌. కృష్ణయ్య..? బీసీ నేతకు జగన్‌ అవకాశం..!