బిగ్ బ్రేకింగ్…. ఏపీ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకున్న సర్కార్

ఏపీలోని జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. గత ఏడాది జనవరి 27న మండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో గత 22 నెలలుగా ఈ తీర్మానం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు కేంద్రం నిర్ణయం రాకపోవడంతో తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

శాసనమండలి రద్దు తర్వాత ఒక సందిగ్ధం ఉండిపోయిందని… సందిగ్థతను తొలగించేందుకు మండలిని కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రవేశపెట్టిన తీర్మానం కాపీని త్వరలోనే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది.

Related Articles

Latest Articles