Somu Veerraju Challengers Chandrababu Naidu: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి రావద్దన్నారని.. కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఏపీలోకి అనుమతించలేదని మండిపడ్డారు. శాంతి భద్రతలనేవి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయని సూచించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో అనుమతించకుంటే.. జగన్ పాదయాత్రలు చేసేవారా? అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఐదేళ్లపాటు జగన్‌ని రోడ్లపై నడిపించారని అన్నారు. బెంగాల్‌లో ఐదు వందల మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురైనా.. తాము ప్రజాస్వామ్యయుతంగానే పోరాటం చేస్తున్నామన్నారు.
Honey Health Benefits: తేనెను ఇలా తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని.. ప్రతీ విషయంలో కేంద్రాన్ని విమర్శించటం సరికాదని సోము వీర్రాజు హితవు పలికారు. దమ్ముంటే.. చంద్రబాబు ముందుకు వస్తే ఒకే వేదికపై చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. అప్పట్లో చంద్రబాబే ప్రత్యేక హోదా వద్దన్నారని.. ఇప్పుడు సభలు పెడుతున్న చంద్రబాబును అప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారో ప్రశ్నిస్తున్నారా? అని నిలదీశారు. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పి, ఐదుగురు ప్రధానులను మార్చినప్పడు.. రైల్వే జోన్ తేవచ్చు కదా అని అన్నారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసొచ్చారని, పొత్తులపై వారే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. తానే మాట్లాడే మాటల్లో తప్పులు ఉంటే చెప్పాలని.. చంద్రబాబు వస్తే ఆయన్నే అడుగుతానని చెప్పుకొచ్చారు.
Video Call: ఆమెకు 20.. ఆయనకు 79.. న్యూడ్ వీడియో కాల్.. కట్ చేస్తే!
అంతకుముందు.. నారా లోకేష్‌పై కూడా సోము వీర్రాజు ధ్వజమెత్తారు. తన పాదయాత్రలో రాయలసీమను అభివృద్ధి చేస్తామని లోకేష్ హామీలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. 14 సంవత్సరాల పాటు చంద్రబాబు సీఎంగా ఉన్నా.. రాయలసీమకు ఏమీ చెయ్యలేదని దుయ్యబట్టారు. మళ్లీ రాయలసీమను అభివృద్ధి చేస్తామంటే, ప్రజలు నమ్మరని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు వేసింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమేనని, వైసీపీ ప్రభుత్వం ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. ఏపీలో తాము అభివృద్ధి చేస్తే.. జగన్ సర్కార్ తమ స్టిక్కర్లు వేసుకుందని ఆరోపణలు చేశారు.