Site icon NTV Telugu

Somu Veerraju: కేంద్రం బియ్యాన్ని అమ్ముకుంటున్నారు.. నిధులను వాడుకుంటున్నారు..!

Somu Veerraju

Somu Veerraju

ఏపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కేంద్రం సరఫరా చేసే ఉచిత బియ్యం రాష్ట్రం అందించట్లేదని ఆరోపించిన ఆయన.. నాలుగు నెలలుగా బియ్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సరైన వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్రం పంపిణీ చేయకపోవడంలేదంటూ బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు కూర్చున్న సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం దిగిరకపోతే 18వ తేదీన అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాం.. ఇంకా ప్రభుత్వం దిగిరకపోతే ఉద్యమం దిగువ స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు.. ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్న బియ్యాన్ని రాష్ట్రం అమ్మేసుకుంటుందని.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయంపై సరైన వివరణ ఇవ్వట్లేదని మండిపడ్డారు.. ఇక, కేంద్రం ఇచ్చే నిధులను కూడా రాష్ట్రం వాడేసుకుంటుందని ఆరోపించారు సోము వీర్రాజు.

Read Also: TDP : ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే విన్నపాలేంటి.? ఇంతలో మరో నాయకుడు కర్చీఫ్ వేస్తున్నారా.?

ప్రజలు వైసీపీ నాయకులను బియ్యం ఇవ్వట్లేదు అని అడిగితే మోడీ ఇవ్వట్లేదు అని అబద్ధాలు చెబుతున్నారని.. కానీ, అందులో నిజం లేదన్నారు సోము వీర్రాజు.. కేజీ బియ్యానికి రాష్ట్రం ఇచ్చేది 2 రూపాయాలైతే.. కేంద్రం రూ.38.45 ఇస్తుందని తెలిపారు.. పేదలకు బియ్యం ఇవ్వకుండా బియ్యం అమ్మేసుకునే వాళ్లకు ఇస్తున్నారని ఆరోపించారు. ఇక, ఎన్నో ఏళ్ల నుంచి కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతి అయిపోతుంది… పెద్ద మోసం జరుగుతుంది రాష్ట్రంలో అన్నారు.. జగన్ ప్రభుత్వం మిల్లర్ల ప్రభుత్వమని విమర్శించిన ఏపీ బీజేపీ చీఫ్‌.. మిల్లర్ల చేత రైతుల నుంచి తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు సీఎం వైఎస్‌ జగన్‌కు దమ్ముంటే, నిజాయితీ వుంటే సివిల్ సప్లై ఛైర్మెన్ భాస్కర్ రెడ్డిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. పేదవాళ్లను మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు మోసం చేస్తున్నారు.. కేంద్రం గ్రామీణ అభివృద్ధికి సర్పంచ్ ల అకౌంట్లలలో డబ్బులు వేస్తుంటే ఇప్పటికి రిలీజ్ చేయలేదని నిలదీశారు.. దయచేసి రాష్ట్రాన్ని దివాళా తియించొద్దు అని విజ్ఞప్తి చేశారు సోము వీర్రాజు.

Exit mobile version