NTV Telugu Site icon

Somireddy ChandramohanReddy: జగన్ హయాంలో ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసం

Tdp Somi

Tdp Somi

ఏపీలో జగన్ పాలనపై మహానాడు వేదికగా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మహానాడు 2022లో భాగంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సమావేశంలో ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసంపై తీర్మానం ప్రవేశపెట్టారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి. సీఎం జగనుపై సీరియస్ కామెంట్లు చేశారు సోమిరెడ్డి. వ్యవస్థలపై సీఎం జగనుకు నమ్మకం లేదు. పరిపాలనా వ్యవస్థను జగన్ భ్రష్టుపట్టించారు….

తన తండ్రి హయాంలో జగన్ చేసిన అవినీతికి ఐఏఎస్సులు జైళ్ల పాలయ్యారు. సీఎం హోదాలో ఉన్న జగన్ మాటను అమలు చేసినందుకు 8 మంది ఐఏఎస్సులకు జైలు శిక్ష విధించింది కోర్టు. అధికారులను వాడుకుని వదిలేయడం జగనుకు అలవాటు. గత ఎన్నికల్లో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని వాడుకుని.. ఆ తర్వాత గెంటేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ లోపలకు పిలిచి ఏం కుమ్మారో ఏమో.. బయటకొచ్చి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం హైదరాబాదులో ఉండే పదవీ విరమణ చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌ని కూడా వాడుకుని పక్కన పెట్టేశారు. వివిధ సందర్భాల్లో న్యాయ వ్యవస్ధపై జగన్ సహా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా వున్నాయన్నారు సోమిరెడ్డి.

Kuna Ravi: తమ్మినేని కామెంట్లపై కూన రవి ఫైర్

Show comments