Shiv Shankar Babu Cheated Woman In The Name Of Marriage: నేరాలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు అదే పనిగా దొంగతనాలు చేస్తూ, పోలీసు రికార్డులకు ఎక్కుతారు. మరికొందరు ఎవరికీ అనుమానం రాకుండా తమ పని కానిచ్చేస్తుంటారు. బైటకొస్తే గానీ వారి బండారం తెలియదు. అలాంటి సీక్రెట్ క్రైమ్ చేయడంలో దిట్ట అయిన ఓ వ్యక్తి.. నిత్య పెళ్లికొడుకు అవతారం ఎత్తాడు. అతడు నిత్య పెళ్లికొడుకు అని తెలిసినా.. అమాయక మహిళలు మాత్రం ‘అబ్బే మా ఆయన బంగారం అనేవారే’! అయితే.. ఓ బాధితురాలు మాత్రం అనుమానం వచ్చి పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో.. సారువారి సీక్రెట్ పెళ్లిళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది.
మాట్రిమోనీ సైట్‌లో అతగాడి ప్రొఫైల్ రెగ్యులర్‌గా ఉంటుంది. అలా అని అయ్యో పాపం పెళ్లికాలేదని జాలిపడేరు. సారు వారి ప్రొఫైల్‌లో ‘సెకండ్ మ్యారేజ్ లేడీస్ ప్రియారిటీ’ అని ఉంటుంది. ఇంకేముందీ.. అప్పటికే ఓసారి జీవితంలో ఓడిపోయి, ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న అమాయక మహిళలు, ఆ మెసేజ్‌కు అట్రాక్ట్ కాకుండా ఉంటారా? ఎవరో ఒకరు ఈ జీవితానికి తోడుంటే చాలు అనుకునే మహిళలే ఈ ప్రబుద్దుడి టార్గెట్. అది తెలియని అమాయకులు ఇతగాడి ఉచ్చులో పడి, మొదటి సారి కన్నా రెండో సారి పెళ్లి చేసుకునే ఎక్కువ డ్యామేజ్ అయ్యామని బాదపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
అతని పేరు అడపా శివశంకరబాబు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతిపూడి గ్రామానికి చెందిన ఈయన.. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. అందరికీ ప్రైవేటు జాబ్ చేస్తానని చెప్తుంటాడు. కానీ, ఇతను చేసేది మాత్రం.. ఎప్పుడు, ఎలా, ఎవరిని బుట్టలో వెసుకోవాలా అనేదే! అందుకు.. అమాయక మహిళలు, విడో లేడీస్ వైపే చూస్తాడు. మాట్రిమోనీలో తన ప్రొఫైల్ చూసి కాంటాక్ట్ అయ్యారో, ఇక అంతే సంగతులు. వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. శివశంకరబాబుతో ఒక్కసారి ఫోన్‌లో మాట్లాడితే చాలు. చావైనా బతుకైనా ఇక ఇతనితోనే అనుకోవాల్సిందే. అలా అనుకున్న వాళ్లంతా ఇప్పుడు పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతున్నారు.
మాట్రిమోనీ సైట్‌ల ద్వారా కొందరు.. ఫ్రెండ్స్ ద్వారా కొందరు.. పరిచయమైన ఏ మహిళనూ వదలడు గాక వదలడు. పెళ్లి పేరుతో పరిచయం పెంచుకుని కొందరిని మోసం చేస్తే.. డైరెక్ట్‌గా పెళ్లి చేసుకుని కాపురం పెట్టి మరికొందరిని చీట్ చేశాడు. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతగాడిపై నమోదైన కేసులుఐదు. 2019లో కేపీహెచ్‌బీ, గచ్చిబౌలీ పీయస్‌లలో కేసులు నమోదు కాగా.. గతేడాది అనంతపూర్ టౌన్ పీఎస్‌లో కేసు నమోదు అయింది. ఇక ఈ ఏడాదిలో బాలానగర్, రామచంద్రాపురం పీఎస్‌లతో పాటు గచ్చిబౌలీ పీఎస్‌లో మరో కొత్త కేసు నమోదైంది.
తనను ఆర్యసమాజ్‌లో పెల్లి చేసుకుని, రోజూ నైట్ డ్యూటీ అని వెళ్లేవాడంటూ కొండాపూర్‌కు చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరికీ అమెరికా ప్రాసెసింగ్ చేయాలంటూ.. 32 లక్షల నగదుతో పాటు బంగారం కూడా తీసుకున్నాడంటోంది. తనలాంటి అమాయకులు మరెవరూ ఇతగాడి వలలో పడి మోసపోవద్దని పోలీసులకు దైర్యంగా ఫిర్యాదు చేసానంటోంది బాదితురాలు. కొండాపూర్‌కు చెందిన ఈ బాదితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో.. విచారణ జరిపిన గచ్చిబౌలీ పోలీసులు నిత్యపెళ్లికొడుకు శివశంకరబాబు వ్యవహారం నిజమేనిని తేల్చారు. వైజాగ్‌లో ఉన్న ఇతగాడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
ఐదు కేసులు తమ దృష్టికి వచ్చాయంటున్న పోలీసులు.. కేసు పెట్టేందుకు ముందుకు రాని బాదితురాళ్లు కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మహిళలను మోసం చేసి వారి నుంచి సేకరించిన బంగారాన్ని సైతం.. తన పేరుపై పెట్టుకోకుండా, తాను మోసం చేసే మరో మహిళ పేరుపై బ్యాంకులో మార్టిగేజ్ చేస్తూ, ఎక్కడా తన చేతికి మట్టి అంటకుండా ఉండాలని జాగ్రత్త పడేవాడని గుర్తించారు పోలీసులు. నిందితున్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే.. మరిన్ని నిజాలు తెలిసే అవకాశాలున్నాయంటున్నారు. చూశారుగా.. మాట్రిమోనీలో ప్రొపైల్ చూసి, ఎంక్వైరీ చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే, ఇలాంటి మోసగాళ్ల చేతిలో పడక తప్పదు. సో.. లేడీస్, బీ అలర్ట్!