కలం మూగబోయింది. సుదీర్ఘకాలం సేవలందించిన సీనియర్ పాత్రికేయులు శ్రీ విద్యారణ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, హిందీ మిలాప్ దినపత్రికలలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. కెరియర్ ప్రారంభంలో హిందూస్థాన్ సమాచార్ కు సేవలు అందించారు. కేంద్ర సెన్సార్ బోర్డ్ మెంబెర్ గా వున్నారు.
వారి హఠాన్మరణం జాతీయవాద పాత్రికేయులకు తీరనిలోటు అని పలువురు పాత్రికేయులు నివాళులర్పిస్తున్నారు. సీనియర్ పాత్రికేయుడు, సౌమ్యుడు, జాతీయవాది విద్యారణ్య కామ్లేకర్ కన్నుమూశారు. కామ్లేకర్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వెంకయ్యనాయుడు ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విద్యారణ్య కామ్లేకర్ ప్రస్తుతం సకాల్ మరాఠీ పత్రికకు తెలుగు రాష్ట్రాల ఇంఛార్జిగా పని చేస్తున్నారు.
సీనియర్ జర్నలిస్టు విద్యారణ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, సత్య కుమార్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఇటీవల హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల సందర్భంగా అందరినీ కలిసి పలకరించిన విద్యారణ్య … మూడురోజుల్లోనే తిరిగి రాని లోకాలకు చేరడం తట్టుకోలేకపోతున్నామని పలువురు పాత్రికేయులు వాపోయారు. ఆయనతో అనుబంధాన్ని తలచుకుని విచారం వ్యక్తం చేస్తున్నారు.