ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు విక్రయించేందుకు సిద్ధం అవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వారం రోజుల్లో ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారిని ప్రారంభిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ నెల 18వ తేదీ నుంచి పెరటాసి మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆఫ్ లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసే యోచనలో ఉంది టీటీడీ.. టోకెన్ల కోసం తమిళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం వుండడంతో కోవిడ్ నిబంధనలు అమలు చేయడం కష్టం అవుతుందని.. నిబంధనలకు ఆటంకం కలుగుతుందని భావిస్తున్న టీటీడీ.. ఈ నిర్ణయానికి వచ్చింది… ఇక, రోజుకి 8 వేల చొప్పున ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌లోనే సర్వదర్శనం టోకెన్లు-టీటీడీ

YV Subba Reddy