ప్రపంచవ్యాప్తంగా సలార్ ఫీవర్ పట్టుకుంది.. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. టికెట్లు దొరకలేదని ఫ్యాన్స్ ఒకవైపు గొడవలకు దిగుతున్నారు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ మొదటి భాగం.. సీజ్ ఫైర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. నేడు ఇండియా వైడ్ భారీ స్థాయిలో భారీ అంచనాలు మధ్య ఈ చిత్రం రిలీజ్ అయ్యింది..
ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు.. సినిమా చూసిన వారు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ప్రభాస్ నుంచి ఒక మాస్ బొమ్మ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు.. అరిరిపోయే మాస్ ఎంటర్టైనర్ దొరికినట్లు చెబుతున్నారు.. సినిమా ఓ రేంజులో ఉందంటూ ఫ్యాన్స్ సినిమా హాళ్ళ వద్ద రచ్చ రచ్చ చేస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలతో సలార్ షోస్ మొదలయ్యాయి. కానీ ప్రభాస్ సొంత ఊరులో మాత్రం ఒక్క థియేటర్లో కూడా బెనిఫిట్ షో పడకపోవడం గమనార్హం…
ఇదిలా ఉండగా.. డార్లింగ్ సొంతూరు భీమవరంలో మాత్రం టికెట్లు డబుల్ రేట్లకు అమ్ముతున్నారని వార్తలు కూడా వినిపిస్తుంది.. ఈ విషయం గురించి అభిమానులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ నిర్ణయించిన రేట్లకే టికెట్లు అమ్మాలని థియేటర్ యాజమాన్యాయానికి ఆర్డర్ పాస్ చేశారు. ఈ గొడవల కారణంగా ఇక్కడ బెనిఫిట్ షోలు పడలేదు.. ఒంగోలు గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ లో సలార్ సినిమా చూసిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి.. మూవీ పై తన రివ్యూ ఇచ్చారు. సలార్ మూవీలో సెకండ్ ఆఫ్ బాగుందని, పైట్స్ సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.. ఏలూరు, విజయవాడ, కడప, నెల్లూరు లో కూడా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే టాక్ వినిపిస్తుంది.. కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..