టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. కందుకూరు ఘటన దురదృష్టకరం అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి మరోసారి 8 మంది అమాయకుల ప్రాణాలు బలయ్యాయి. ఇవి యాక్సిడెంట్ కాదు. చంద్రబాబు వికృత విన్యాసాలకు నిదర్శనం. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణం అయ్యాడు. డ్రోన్ విజువల్స్ కోసం, టైట్ షాట్స్ తాపత్రయ పడ్డారు. కోల్డ్ బ్లడెడ్…ప్లాన్డ్… ప్రచారం కోసం జరిగిన మరణాలు ఇవి అన్నారు సజ్జల.
Read Also: Bandi Sanjay: మిషన్ 90 ప్లాన్.. పక్కా అధికారం మాదే అంటున్న బీజేపీ
100 అడుగుల రోడ్డును ఫ్లెక్సీ పోల్స్ పెట్టి 30 అడుగులుగా కుదించారు.విశాలమైన రోడ్లు లేదా ఖాళీ గ్రౌండ్ లో ఎవరైనా సభలు పెడతారు. దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబుదే. ఇంత జరిగినా చంద్రబాబులో ప్రాయశ్చిత్తం కనిపించ లేదు. శవాల మీద పేలాలు ఏరుకునే వైఖరి చంద్రబాబుది. చనిపోయిన వారిని త్యాగ మూర్తులు అంటున్నాడు.. సమిధలు, ఉద్యమం ఆగదు అంటున్నాడు. చంద్రబాబు వల్ల చనిపోయి ఈయన పొగడ్తలు పొందటమే మృతుల అదృష్టం అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారు.
Read Also: Corona BF7: ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ వస్తేనే ఎంట్రీ.. లేదంటే ఎయిర్ పోర్టులోనే బ్రేక్
ఇంతకు మించిన సిగ్గు మాలినతనం మరొకటి ఉంటుందా?? అని ప్రశ్నించారు సజ్జల. చంద్రబాబు లెక్కలేనితనం, అహంకారం కనిపిస్తోంది. పోలీసుల మీద అభాండాలు వేస్తున్నారు. పోలీసులకు చెప్పిన సమయానికి వచ్చాడా??చెప్పిన ప్రాంతంలో సభ పెట్టారా??ఈ సంఘటన నేపథ్యంలో సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది. 8 మంది మరణానికి కారణం అయిన చంద్రబాబు పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నేను భావిస్తున్నాను. సభలు, సమావేశాలు నిర్వహించేటప్పుడు కచ్చితంగా కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు సజ్జల.
