Google Search: నవతరం అమ్మాయిలు.. అన్నింటిలోనూ ముందే ఉంటారు. కొత్త కాపురానికి వెళ్ళేటప్పుడు అమ్మ, అమ్మమ్మలు చెప్పిన మాటలను వినడం అనేది తక్కువ.. ఎందుకంటే వారిలా ఉంటే ఈ కాలంలో బతకలేం అనేది అందరికి తెల్సిన విషయమే.. అంతేకాదు ఈ కాలం అమ్మాయిలు.. అత్తలతో కలిసి ఉండాలి.. కోడలిలా ఎలా ఉండాలి అన్నదాని కన్నా భర్తతో ఒంటరిగా ఉండాలి.. భర్త తన మాట మాత్రమే వినేలా చేయాలి అని కోరుకుంటున్నారు. అందుకు ఈ నవతరం మగువలు గూగుల్ తల్లిని నమ్ముకున్నారట.. నిజం .. ఈ ఏడాది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు గూగుల్ సెర్చ్ చేసిన నివేదిక చూస్తే దిమ్మ తిరగాల్సిందే.
మనకున్న అనుమానాలను ఒకరి ముందు చెప్పి వారి సలహాలు తీసుకోవడం కన్నా.. గూగుల్ తల్లిని అడిగి తెలుసుకోవడం బెటర్ అని ఫీల్ అవుతున్నారట.. ఇక ఎక్కువగా గూగుల్ లో కొత్త పెళ్లి కూతుళ్లు ఏం చేస్తున్నారంటే.. భర్తను మనవైపు తిప్పుకోవడం ఎలా..? నా భర్త నా మాట వినాలంటే ఏం చేయాలి..? అత్తమామలను బుట్టలో వేసుకోవడం ఎలా..? అని సెర్చ్ చేస్తున్నారట. ఇక మరికొంతమంది యువతులు.. పిల్లలు పుట్టకుండా శృంగారం చేయడం ఎలా..? భర్తకు శృంగారంలో హాయి తెప్పించడం ఎలా..? అని కూడా సెర్చ్ చేస్తున్నారట. ఏదిఏమైనా నవతరం యువత ఒక అడుగు ముందుకు వేసిందంటే ఆశ్చర్యపోవాలో.. చివరికి పెద్దాళ్ళు చెప్పిన ఇవే మాటలను పట్టించుకొనేవారు గూగుల్ చెప్తుంటే తూచా తప్పకుండ పాటిస్తునందుకు బాధపడాలో అర్థంకాని పరిస్థితి అని అంటున్నారు నెటిజన్లు.