Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: ముందస్తుకు వెళ్లాల్సిన అవసరమేంటి?

ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుందని వస్తున్న వార్తలపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ రెండున్నరేళ్లకు ఉంటుందని సీఎం జగన్ ముందే చెప్పారని, త్వరలోనే కెబినెట్ రీ-షఫుల్ ఉండే అవకాశం వుందన్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ మాకు కీలకమే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

అవసరాన్ని బట్టి మంత్రులుగా ఉండే వాళ్ళను పార్టీకి వినియోగించుకుంటాం అన్నారు. చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నాడు. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి..? ఇప్పటికే అడుగంటిన పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారు. మాకు ఐదేళ్లు ప్రజలు అధికారం ఇచ్చారు.. తగ్గించుకోవాల్సిన అవసరం ఏముంది..? ప్రజల్ని మోసం చేయాలి.. భ్రమపెట్టాలి అనుకున్న వారే ముందస్తుకు వెళతారన్నారు సజ్జల.

https://ntvtelugu.com/mla-ms-babu-dance-in-private-party/
Exit mobile version