NTV Telugu Site icon

MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికలకు.. వైసీపీ అభ్యర్థులు వీరే

Mlc Elections

Mlc Elections

MLC Elections 2023: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది.. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేశారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. సామాజిక సమీకరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.. మరోపారి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్‌.. మొత్తంగా.. ఏపీలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో అభ్యర్థుల పేర్లను ప్రకటిచింది వైసీపీ..18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇవాళ ప్రకటించారు..

Read Also: Wheat Price : భారీగా పెరిగిన గోధుమల ధర.. ఎగుమతులకు నో చెప్పిన కేంద్రం

సామాజిక న్యాయానికి వైఎస్సార్‌సీపీ, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశాం. బీసీలంటూ బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ క్లాస్‌. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చామని గుర్తుచేశారు.. ఓట్ల కోసం నినాదాలు ఇచ్చే పార్టీ మాది కాదు. వారిని అధికారంలో భాగస్వామ్యం చేశాం. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని చెప్పుకొచ్చారు.. ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక కోటాలో 9 మంది అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, మొత్తం 18 స్థానాలకు వైసీపీ ప్రకటించిన అభ్యర్థులను సామాజిక తరగతుల వారీగా చూస్తే.. బీసీలు 11, ఎస్సీలు 2, ఎస్టీ 1, వోసీలకు 4 స్థానాలు కేటాయించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.

Read Also: Horseshoe Crab: ఓరి నాయనో.. పీత ధర 11 లక్షలా..!

ఇక, వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు.. నత్తు రామారావు- శ్రీకాకుళం, లోకల్‌ కోటా (బీసీ, యాదవ), కుడుపూడి సూర్యనారాయణ- తూర్పు గోదావరి, లోకల్‌ కోటా (బీసీ-శెట్టి బలిజ), వంకా రవీంద్రనాథ్‌ – పశ్చిమ గోదావరి,‍ లోకల్‌ ​కోటా (పారిశ్రామికవేత్త), కవురు శ్రీనివాస్‌ – ప.గోదావరి, లోకల్‌ కోటా( బీసీ-శెట్టి బలిజ), మేరుగ మురళి – నెల్లూరు, లోకల్‌ కోటా (ఎస్సీ-మాల), డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం-చిత్తూరు, లోకల్‌ కోటా, రామసుబ్బారెడ్డి – కడప, లోకల్‌ కోటా (ఓసీ-రెడ్డి), డాక్టర్‌ మధుసూదన్‌ – కర్నూలు, లోకల్‌ కోటా (బీసీ-బోయ), ఎస్‌. మంగమ్మ- అనంతపురం, లోకల్‌ కోటా( బీసీ-బోయ).. మరోవైపు.. ఎమ్మెల్యే కోటా అభ్యర్థుల విషానికి వెళ్తే.. పెనుమత్స సూర్యనారాయణ- విజయనగరం, ఎమ్మెల్యే కోటా( క్షత్రియ సామాజిక వర్గం) , పోతుల సునీత- ప్రకాశం, ఎమ్మెల్యే కోటా (బీసీ- పద్మశాలి) , కోలా గురువులు-విశాఖ, ఎమ్మెల్యే కోటా (ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌), బొమ్మి ఇ‍జ్రాయిల్‌.. తూర్పు గోదావరి, ఎమ్మెల్యే కోటా ( ఎస్సీ-మాదిగ), జయమంగళ వెంకటరమణ- ప. గోదావరి, లోకల్‌ కోటా (వడ్డీల సామాజిక వర్గం), ఏసు రత్నం- గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( బీసీ-వడ్డెర), మర్రి రాజశేఖర్‌- గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( కమ్మ), ఇక, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయానికి వస్తే.. కుంభా రవి- అల్లూరి జిల్లా, (ఎస్టీ), కర్రి పద్మశ్రీ- కాకినాడ, (బీసీ)గా నిర్ణయించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం.

 

 

Show comments