MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికలకు.. వైసీపీ అభ్యర్థులు వీరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Elections 2023: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది.. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేశారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సామాజిక సమీకరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.. మరోపారి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్.. మొత్తంగా.. ఏపీలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్ కోటాలో అభ్యర్థుల పేర్లను ప్రకటిచింది వైసీపీ..18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇవాళ ప్రకటించారు..
Read Also: Wheat Price : భారీగా పెరిగిన గోధుమల ధర.. ఎగుమతులకు నో చెప్పిన కేంద్రం
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
సామాజిక న్యాయానికి వైఎస్సార్‌సీపీ, పార్టీ అధినేత వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశాం. బీసీలంటూ బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్‌బోన్ క్లాస్. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చామని గుర్తుచేశారు.. ఓట్ల కోసం నినాదాలు ఇచ్చే పార్టీ మాది కాదు. వారిని అధికారంలో భాగస్వామ్యం చేశాం. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని చెప్పుకొచ్చారు.. ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక కోటాలో 9 మంది అభ్యర్థులు, గవర్నర్ కోటాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, మొత్తం 18 స్థానాలకు వైసీపీ ప్రకటించిన అభ్యర్థులను సామాజిక తరగతుల వారీగా చూస్తే.. బీసీలు 11, ఎస్సీలు 2, ఎస్టీ 1, వోసీలకు 4 స్థానాలు కేటాయించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
Read Also: Horseshoe Crab: ఓరి నాయనో.. పీత ధర 11 లక్షలా..!
ఇక, వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు.. నత్తు రామారావు- శ్రీకాకుళం, లోకల్ కోటా (బీసీ, యాదవ), కుడుపూడి సూర్యనారాయణ- తూర్పు గోదావరి, లోకల్ కోటా (బీసీ-శెట్టి బలిజ), వంకా రవీంద్రనాథ్ – పశ్చిమ గోదావరి, లోకల్ కోటా (పారిశ్రామికవేత్త), కవురు శ్రీనివాస్ – ప.గోదావరి, లోకల్ కోటా( బీసీ-శెట్టి బలిజ), మేరుగ మురళి – నెల్లూరు, లోకల్ కోటా (ఎస్సీ-మాల), డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం-చిత్తూరు, లోకల్ కోటా, రామసుబ్బారెడ్డి – కడప, లోకల్ కోటా (ఓసీ-రెడ్డి), డాక్టర్ మధుసూదన్ – కర్నూలు, లోకల్ కోటా (బీసీ-బోయ), ఎస్. మంగమ్మ- అనంతపురం, లోకల్ కోటా( బీసీ-బోయ).. మరోవైపు.. ఎమ్మెల్యే కోటా అభ్యర్థుల విషానికి వెళ్తే.. పెనుమత్స సూర్యనారాయణ- విజయనగరం, ఎమ్మెల్యే కోటా( క్షత్రియ సామాజిక వర్గం) , పోతుల సునీత- ప్రకాశం, ఎమ్మెల్యే కోటా (బీసీ- పద్మశాలి) , కోలా గురువులు-విశాఖ, ఎమ్మెల్యే కోటా (ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్), బొమ్మి ఇజ్రాయిల్.. తూర్పు గోదావరి, ఎమ్మెల్యే కోటా ( ఎస్సీ-మాదిగ), జయమంగళ వెంకటరమణ- ప. గోదావరి, లోకల్ కోటా (వడ్డీల సామాజిక వర్గం), ఏసు రత్నం- గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( బీసీ-వడ్డెర), మర్రి రాజశేఖర్- గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( కమ్మ), ఇక, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయానికి వస్తే.. కుంభా రవి- అల్లూరి జిల్లా, (ఎస్టీ), కర్రి పద్మశ్రీ- కాకినాడ, (బీసీ)గా నిర్ణయించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.



తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!