NTV Telugu Site icon

YS Viveka Case: వివేకా హత్య కేసులో న్యాయం జరగాలి.. ఎక్కడ విచారణ జరిగినా అభ్యంతరం లేదు..

Ys Viveka Case

Ys Viveka Case

వైఎస్‌ వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని వైఎస్ జగన్ కుటుంబం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరుకుంటుందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. ఆ విషయంపై స్పందించిన ఆయన.. ఏపీలో ఫ్రీ అండ్ ఫేర్ విచారణ జరగడం లేదని వారు అంటున్నారు.. ట్రయల్ ఎక్కడ జరిగినా మాకు అభ్యంతరం లేదన్నారు.. ఇక్కడ ఏదైనా ఇన్ ఫ్లుయన్స్ జరుగుతుందని భావిస్తే అక్కడ జరిగినా మంచిదే అన్నారు.. దర్యాప్తు తెలంగాణలో జరిగినా మంచిదే.. న్యాయం జరగాలన్నదే మా ఆలోచనగా చెప్పుకొచ్చారు.. తెలంగాణలో విచారణ జరిగినా మేం అభ్యంతరం చెప్పడం లేదు.. వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడాలన్నదే మా కోరిక అన్నారు సజ్జల.

Read Also: YS Sharmila: షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి.

ఇక, చంద్రబాబులా రాష్ట్రంలో సీబీఐ అడుగు పెట్టడానికి లేదు అనే విధానం మాది కాదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కాగా, ఏపీలో వివేకా హత్య కేసు దర్యాప్తు సాగుతున్న తీరు, దర్యాప్తు అధికారులకు రాజకీయ బెదిరింపులు, వివేకా కుమార్తె విజ్ఞప్తి వంటి పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. దర్యాప్తును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది.. తన తండ్రి హత్య కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై దర్యాప్తు జరిపిన సుప్రీంకోర్టు.. ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఏపీ నుంచి ఈ కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. తెలంగాణ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసిన ఈ కేసును ఇప్పటివరకూ ఏపీలో కడప, పులివెందులకోర్టులతో పాటు హైకోర్టు కూడా పర్యవేక్షిస్తోన్న విషయం విదితమే..