RK Roja : తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే ఆర్.కె. రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు, మహిళలు, విద్యార్థులు తీవ్రంగా మోసపోయారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా వ్యవసాయం విషయంలో రైతులు గత 15 నెలలుగా నరకం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రోజా మాట్లాడుతూ, “రెండు సంవత్సరాలు గడిచినా రైతు భరోసా ఇవ్వలేదు. కేవలం ఐదు వేలు మాత్రమే ఇచ్చారు. అంతకుమించి ఎలాంటి సహాయం చేయలేదు” అని అన్నారు. యూరియా కొరతను చూపిస్తూ టిడిపి నేతలు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆమె ఆరోపించారు.
Dinesh Karthik: ధోనీ వల్లే నాకు అవకాశాలు రాలేదు.. దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు
నగరి పరిసరాల్లో రైతులకు యూరియా అందకపోవడంతో తమిళనాడు, ప్రొద్దుటూరుకు వెళ్ళి రైతులు కొనుగోలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. “వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నమ్మి రైతులు వారి జీవితాలను నాశనం చేసుకున్నారు” అని వ్యాఖ్యానించారు. మామిడి, చీని, వరి, మిర్చి, పోగాకు వంటి పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు.
“ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి రైతు సమస్యలు పరిష్కరించే సామర్థ్యం లేకపోతే, వారు దిగిపోవాలి. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఎప్పుడూ ఇబ్బందులు పడలేదు” అని రోజా పేర్కొన్నారు. ఇసుక, మద్యం, భూములు, బదిలీలు దోచుకుంటున్నారని, లోకేష్, పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వీరు యూరియాను కూడా బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుని రైతులను దోచుకున్నారు” అని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతూనే కేంద్రానికి లేఖ ఎందుకు రాసిందని ప్రశ్నించారు. “డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని చెప్పుకుంటూ కూడా యూరియా రైతులకు ఎందుకు తీసుకురాలేకపోయారు?” అని మండిపడ్డారు. చివరగా రోజా మాట్లాడుతూ, “రైతులకు ఎల్లప్పుడూ అండగా వైసీపీ నిలుస్తుంది. రైతుల కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.
Kakani Govardhan Reddy : యూరియా పంపిణీలో రూ.200 కోట్లు స్కాం
