NTV Telugu Site icon

Roja: అసెంబ్లీలో ప్రజల సమస్యలు ప్రస్తావించటం కోసమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం..

Roja Rk

Roja Rk

Roja: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై అందరూ ఆతృతగా ఎదురు చూసారు.. ఆయన ప్రసంగంలో జగన్ ను తిట్టిస్తూ.. చంద్రబాబును పొగిడించుకున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ తో పాటు 144 హామీలు ఇచ్చారు.. ఇవాళ ఏ హామీకి సంబంధించిన స్పష్టత ఇవ్వలేదు.. విజన్- 2047 అంటూ తాతమ్మ కథల్లా గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు.. లిక్కర్ రేట్లు కూడా పెంచామని చెప్పించారు.. ఏపీలో టీడీపీ, జనసేన నేతలు సిండికేట్ లా మారి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు అని ఆమె విమర్శలు గుప్పించింది. అబద్ధాలు కూడా పరాకాష్టకు చేరాయి.. అధికారంలోకి వచ్చాక రూ. 15 వేల కోట్ల ఛార్జీలు పెంచి.. ఇక, పెంచమని గవర్నర్ తో చెప్పించారు.. మహిళలకు 1500, ఉచిత బస్సు, తల్లికి వందనం ప్రస్తావన లేదు అని ఆర్కే రోజా అన్నారు.

Read Also: Vigilance Raids: ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విజిలెన్స్ తనిఖీలు..

ఇక, అమ్మఒడి ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేశారు అని మాజీ మంత్రి రోజా తెలిపారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు.. ఈ తొమ్మిది నెలల్లో ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు.. వాలంటీర్లకు తీసేసి వాళ్ల కడుపు కొట్టారు.. ఉద్యోగులను నమ్మించి మోసం చేశారు.. ఆయనను నమ్మి ఓట్లు వేసిన వారిని మరోసారి మోసం చేశారు.. ఇన్నిసార్లు నమ్మిన ఉద్యోగులను చూస్తే జాలేస్తుంది.. జగన్ అయితేనే ఏదైనా చేయగలడని అనేకసార్లు చెప్పా.. ప్రజలు నాశనం అయిపోతున్నారు.. రాష్ట్రం వెనక్కు పోతుంది అని ఆమె తెలిపారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలు ప్రస్తావించటం కోసమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నామని రోజా చెప్పుకొచ్చారు.

Read Also: Bengaluru: “మాజీ ప్రియురాలి” ఇంటిని తగలబెట్టిన వ్యక్తి.. కార్లు, బైకులకు నిప్పు..

అయితే, పవన్ కల్యాణ్ దానిపై ఏదేదో మాట్లాడుతున్నారు.. ఆయన రష్యా అల్లుడు కదా.. జర్మనీ గురించి తెలిసి ఉంటుంది. చంద్రబాబుకు అవసరమైనపుడే పవన్ వచ్చి మాట్లాడుతారు.. జగన్ పై దుష్ప్రచారం చేయడానికే మాట్లాడుతారు.. మీకు భయం లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వండి.. ప్రభుత్వ అవినీతిని ఎత్తి చూపే పీఏసీ చైర్మన్ పోస్ట్ కూడా మీ ఎమ్మెల్యేకు దొంగదారిన ఇచ్చారు అని విమర్శించింది. ఇక, హుందాతనం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం కామెడీగా ఉంది.. సినీ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లోకి వస్తే ప్రజలకు మంచి చేస్తారని భావించారు.. మీరు ఎవరికి ఏం చేసారో చెప్పండి.. రౌడీల్లాగా మాట్లాడింది మీరు.. మీ వల్ల జరిగిన మంచి ఏంటో చెప్పండి.. పవన్, చంద్రబాబుకు హుందాతనం ఉంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. అసెంబ్లీని కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా నడుపుతున్నారు.. అసెంబ్లీకి రాకపోతే ఏం చేసుకుంటారో చేసుకోండని జగన్ ఎప్పుడో చెప్పారు.. ఇంకా అంతకన్నా ఏం చెప్తారు.. గతంలో మాకు 67 మంది ఎమ్మెల్యేలు ఉన్న సమయంలోనే మైకులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు.. గత అనుభవాలు ఉన్నాయి కాబట్టే ప్రతిపక్ష హోదా అడుగుతున్నామని ఆర్కే రోజా పేర్కొన్నారు.