Pawan Kalyan : పవన్ విడాకుల ప్రకటనపై మాజీ భార్య రేణూ దేశాయ్ రియాక్షన్ ఇదే!

Renu Desai Pavan Kalyan

Renu Desai Pavan Kalyan

సోషల్ మీడియా అరచేతిలోకి వచ్చాక ఎవరిపై పడితే వారిపై బురద చల్లడం చాలా సులువైపోయింది. ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్స్ వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా చిన్న కుదుపు వస్తే చాలు, కీబోర్డ్ వీరులు రెచ్చిపోతుంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడిపోతున్నామని ప్రకటించిన క్రమంలో నెట్టింట నెగెటివిటీ ఏ స్థాయిలో చెలరేగిందో అందరికీ తెలిసిందే. అయితే, ఆ ట్రోలింగ్ భూతంపై ఊహించని విధంగా పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ స్పందించిన తీరు, ట్రోలర్స్ కి ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని మరింత దూషించడం, విమర్శించడం నైతికంగా ఏమాత్రం సరైనది కాదని రేణూ దేశాయ్ కుండబద్దలు కొట్టారు. “అప్పటికే కింద పడిపోయి బాధలో ఉన్న వారిని మరింతగా తొక్కేయడం రాక్షసత్వం. వాళ్ళు సమాజంలో ఏ స్థాయిలో ఉన్నా, వాళ్ళు కూడా ఒక మనిషే.. ఎవరో ఒకరికి బిడ్డలు, ఒకరికి తల్లిదండ్రులు లేదా ఎవరో ఒకరికి తోబుట్టువులు అనే కనీస స్పృహ మనం మర్చిపోకూడదు” అంటూ ట్రోలర్స్ కు మానవత్వం విలువను గుర్తుచేశారు.

ఈ పోస్ట్‌లో రేణూ దేశాయ్ వాడిన ఒక వాక్యం నెట్టింట సంచలనంగా మారింది. “మనమంతా ఎన్నో లోపాలతో కూడిన గాజు ఇళ్లలో బతుకుతున్నాం, అలాంటి మనం ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరడం మానుకోవాలి” అని విమర్శకులకు గట్టి చురకలు అంటించారు. అంతేకాకుండా, తాను పవన్ కు మద్దతుగా మాట్లాడితే వచ్చే కామెంట్లను ముందే ఊహించిన ఆమె.. “నేను ఇలా మాట్లాడుతున్నందుకు నాకు ఎలాంటి ‘పేటీఎం’ (డబ్బులు) రాలేదు. సానుభూతి, దయ అనేవి మనిషికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. నా మెదడులోని ‘ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్’ సరిగ్గా పనిచేస్తోంది కాబట్టే ఒక మనిషిగా ఇలా స్పందించగలుగుతున్నాను. దయచేసి దీనిపై మీ పనికిమాలిన ఊహాగానాలు మొదలుపెట్టకండి” అంటూ తనదైన శైలిలో దిమ్మతిరిగే సైంటిఫిక్ పంచ్ వేశారు. విడిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దాడిని చూసి.. ఒక తోటి మనిషిగా రేణూ దేశాయ్ చూపించిన ఈ పరిణతి బహుశా ఈ తరానికి ఒక పెద్ద పాఠం. పగ, ప్రతీకారం అనేవి పక్కనపెట్టి మానవత్వమే మిన్న అని చాటిచెప్పిన ఆమె పోస్ట్, ఎదుటివారి కష్టాన్ని చూసి ఆనందించే ప్రతి ఒక్కరినీ చెంపదెబ్బ కొట్టినట్లుగా ఆలోచింపజేస్తోంది.