Pawan Kalyan : పవన్ విడాకుల ప్రకటనపై మాజీ భార్య రేణూ దేశాయ్ రియాక్షన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా అరచేతిలోకి వచ్చాక ఎవరిపై పడితే వారిపై బురద చల్లడం చాలా సులువైపోయింది. ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్స్ వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా చిన్న కుదుపు వస్తే చాలు, కీబోర్డ్ వీరులు రెచ్చిపోతుంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడిపోతున్నామని ప్రకటించిన క్రమంలో నెట్టింట నెగెటివిటీ ఏ స్థాయిలో చెలరేగిందో అందరికీ తెలిసిందే. అయితే, ఆ ట్రోలింగ్ భూతంపై ఊహించని విధంగా పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ స్పందించిన తీరు, ట్రోలర్స్ కి ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని మరింత దూషించడం, విమర్శించడం నైతికంగా ఏమాత్రం సరైనది కాదని రేణూ దేశాయ్ కుండబద్దలు కొట్టారు. “అప్పటికే కింద పడిపోయి బాధలో ఉన్న వారిని మరింతగా తొక్కేయడం రాక్షసత్వం. వాళ్ళు సమాజంలో ఏ స్థాయిలో ఉన్నా, వాళ్ళు కూడా ఒక మనిషే.. ఎవరో ఒకరికి బిడ్డలు, ఒకరికి తల్లిదండ్రులు లేదా ఎవరో ఒకరికి తోబుట్టువులు అనే కనీస స్పృహ మనం మర్చిపోకూడదు” అంటూ ట్రోలర్స్ కు మానవత్వం విలువను గుర్తుచేశారు.
ఈ పోస్ట్‌లో రేణూ దేశాయ్ వాడిన ఒక వాక్యం నెట్టింట సంచలనంగా మారింది. “మనమంతా ఎన్నో లోపాలతో కూడిన గాజు ఇళ్లలో బతుకుతున్నాం, అలాంటి మనం ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరడం మానుకోవాలి” అని విమర్శకులకు గట్టి చురకలు అంటించారు. అంతేకాకుండా, తాను పవన్ కు మద్దతుగా మాట్లాడితే వచ్చే కామెంట్లను ముందే ఊహించిన ఆమె.. “నేను ఇలా మాట్లాడుతున్నందుకు నాకు ఎలాంటి ‘పేటీఎం’ (డబ్బులు) రాలేదు. సానుభూతి, దయ అనేవి మనిషికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. నా మెదడులోని ‘ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్’ సరిగ్గా పనిచేస్తోంది కాబట్టే ఒక మనిషిగా ఇలా స్పందించగలుగుతున్నాను. దయచేసి దీనిపై మీ పనికిమాలిన ఊహాగానాలు మొదలుపెట్టకండి” అంటూ తనదైన శైలిలో దిమ్మతిరిగే సైంటిఫిక్ పంచ్ వేశారు. విడిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దాడిని చూసి.. ఒక తోటి మనిషిగా రేణూ దేశాయ్ చూపించిన ఈ పరిణతి బహుశా ఈ తరానికి ఒక పెద్ద పాఠం. పగ, ప్రతీకారం అనేవి పక్కనపెట్టి మానవత్వమే మిన్న అని చాటిచెప్పిన ఆమె పోస్ట్, ఎదుటివారి కష్టాన్ని చూసి ఆనందించే ప్రతి ఒక్కరినీ చెంపదెబ్బ కొట్టినట్లుగా ఆలోచింపజేస్తోంది.
Also Read
- Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
- Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్‌లు..
- Ramayana Box Office Collections: బాక్సాఫీస్ వద్ద 'రామాయణ' ప్రభంజనం.. మొదటి భారతీయ చిత్రంగా అరుదైన ఘనత!
- Ram Charan: 'చిరు లీక్స్' లాగా కాదు.. అనస్వర రిలేషన్షిప్ లీక్ చేయను!
తాజావార్తలు
-
Pawan Kalyan : పవన్ విడాకుల ప్రకటనపై మాజీ భార్య రేణూ దేశాయ్ రియాక్షన్ ఇదే!
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం..
-
Koti Deepotsavam 2026: నవంబర్ 14 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’
-
Sonia Gandhi: సోనియా ప్రధాని కాకపోవడానికి కారణం వాళ్లే.. సంచలన విషయాలు వెలుగులోకి..
-
Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?