Rammohan Naidu : మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ చేసిన క్షమించరాని పాపం
- మహిళా బిల్లుపై కేంద్రం vs విపక్షాలు
- డీలిమిటేషన్ వివాదం ముదిరింది
- కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
- పోరాటం కొనసాగుతుందని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లును విపక్ష ‘ఇండియా’ కూటమి వ్యతిరేకించడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజును భారత ప్రజాస్వామ్యంలో ఒక ‘చీకటి రోజు’గా ఆయన అభివర్ణించారు. మహిళల సమస్యలకు వారే స్వయంగా నాయకత్వం వహించాలనే గొప్ప ఆశయంతో ప్రధాని మోదీ ఈ బిల్లును తీసుకువస్తే, రాజకీయ కక్షతో విపక్షాలు దానిని అడ్డుకున్నాయని ఆయన మండిపడ్డారు. ఇది ‘ఇండియా కూటమి’ కాదు, అసలైన ‘మహిళా వ్యతిరేక కూటమి’ అని ఆయన ఎద్దేవా చేశారు.
బిల్లుపై చర్చ సందర్భంగా హోం మంత్రి, న్యాయ మంత్రి , స్వయంగా ప్రధాని హామీ ఇచ్చినా విపక్షాలు మొండిగా వ్యవహరించాయని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, నియోజకవర్గాల పెంపులో సమన్యాయం చేస్తామని స్పష్టం చేసినా విపక్షాలు కావాలనే ‘డీలిమిటేషన్’ సాకును అడ్డుపెట్టుకున్నాయని విమర్శించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల పెంపును బిల్లులో పొందుపరుస్తామని అమిత్ షా హామీ ఇచ్చినా, దానిని తృణీకరించడం వెనుక విపక్షాల కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారం 54 కోట్ల జనాభాకు 550 మంది ఎంపీలు ఉంటే, నేడు 140 కోట్ల జనాభాకు తగ్గట్టుగా ఎంపీల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్న వాస్తవాన్ని వారు విస్మరిస్తున్నారని పేర్కొన్నారు.
Also Read
- Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
మహిళా రిజర్వేషన్లు ఎప్పటికీ అమలు కాకూడదన్నదే కాంగ్రెస్ అసలు ఉద్దేశమని మంత్రి విమర్శించారు. గతంలో యూపీఏ హయాంలో బిల్లును రాజ్యసభలో ఆమోదించినా, లోక్‌సభలో కావాలనే అటకెక్కించారని గుర్తు చేశారు. 2026 జనగణన ఆలస్యం అవుతున్నందున, ముందస్తుగా నియోజకవర్గాల పెంపు , మహిళా రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే దానిని అడ్డుకోవడం ఘోరమైన పాపమని అన్నారు. బిల్లు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే పార్టీలు సంబరాలు చేసుకోవడం మహిళా లోకాన్ని అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసింది కేవలం తప్పు మాత్రమే కాదని, మహిళలను మోసం చేస్తూ చేసిన ఘోర పాపమని, ఎన్నిసార్లు కాశీలో మునిగినా ఈ పాపం పోదని ఘాటుగా విమర్శించారు.
అయోధ్య రామ మందిర నిర్మాణం, జీఎస్టీ వంటి అసాధ్యాలను సుసాధ్యం చేసిన ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళలకు న్యాయం చేసే వరకు తమ ప్రయత్నం ఆగదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మహిళలు ఎంతో తెలివైన వారని, తమకు దక్కాల్సిన రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న పార్టీలకు రాబోయే రోజుల్లో మహిళలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. రాజకీయ పంతాల కోసం మహిళల ఆశలను అడియాశలు చేసిన విపక్షాలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?