Woman Killed by Lover for Refusing Prostitution in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలు వ్యభిచారం చేయడానికి అంగీకరించలేదని కత్తితో పొడిచి చంపేశాడు ప్రియుడు. అడ్డు వచ్చిన ప్రియురాలి తల్లి, సోదరుడుని కూడా గాయపరిచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటనతో యువతి కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
రాజోలు మండలం మెరకపాలెం గ్రామానికి చెందిన ఓలేటి పుష్ప (22)కు నాలుగేళ్ల క్రితం దగ్గర బంధువుతో వివాహం జరిగింది. వివాహం జరిగిన నాలుగు నెలలకే భర్తతో అంతర్గత వివాదాలతో విడిపోయింది. అనంతరం విజయవాడలో కారు ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న షేక్ షమ్మ (22)తో పరిచయం ఏర్పడింది. గత కొంతకాలంగా బి సావరం గ్రామం సిద్ధార్థ నగర్‌లో ఇల్లు అద్దెకి తీసుకొని ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. షేక్ షమ్మ గంజాయి, చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. నిత్యం డబ్బుల కోసం పుష్పను వేధిస్తుండేవాడు.
Also Read: Virat Kohli: ‘కింగ్’ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డ్.. మరో ఆటగాడికి సాధ్యం కాదేమో?
చెడు వ్యసనాలకు అలవాటు పడిన షేక్ షమ్మ.. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. తనకు అర్జెంటుగా డబ్బులు కావాలని, వ్యభిచారం చేయడానికి తన వెంట రావాలని పుష్పను ఫోర్స్ చేశాడు. అందుకు పుష్ప నిరాకరించడంతో.. వెంట తెచ్చుకున్న చాకుతో పుష్ప ఎడమ రూముపై పొడిచాడు. ఆ సమయంలో అడ్డు వెళ్లిన పుష్ప సోదరుడు, తల్లిని కూడా గాయపరిచాడు. ఆపై అక్కడ నుండి షేక్ షమ్మ పరారయ్యాడు. తీవ్ర గాయంతో పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. పుష్ప మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన రాజోలు మండలంలో కలకలం రేపుతుంది.