పడుపు వృత్తికి రాజమండ్రిలో పడకలు అంటూ ఎన్ టీవీలో వచ్చిన కథనాలపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు స్పందించారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని స్పా సెంటర్ లపై నిఘా పెంచారు. . రాజమండ్రిలో ఉన్న స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు పోలీసులు. దాడుల్లో భాగంగా భారీగా విటులు, అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
పూర్తి వివరాల్లోకి వెళితే….ఎన్ టీవీలో వచ్చిన కథనాలపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు స్పందించారు. రాజమండ్రి జిల్లా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నఅన్ని స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. అనంతరం స్పా సెంటర్లను క్లోజ్ చేయించారు. ఇటీవల రాజమండ్రిలో స్పా మసాజ్ బ్యూటీ సెంటర్లు వ్యభిచార గృహాలుగా మారిపోతున్నాయి. వీటిపై ఫిర్యాదులు రావడంతో స్పా సెంటర్ల పై పోలీసులు దాడి చేస్తున్నారు. దాడి చేసిన ప్రతి సెంటర్ లోనూ విటులు, అమ్మాయిలను భారీ సంఖ్యలో పట్టుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. స్పా సెంటర్లలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని రాజమండ్రి పోలీసులు హెచ్చరించారు. పోలీసులు వార్నింగ్ ఇచ్చినప్పటికి కొన్ని స్పా సెంటర్లు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. ఇంకా స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం.