Site icon NTV Telugu

Margani Bharatram: ఆ అరెస్టుల్లో రాజకీయ దురుద్దేశం లేదు

Mp Margani Bharat Ram

Mp Margani Bharat Ram

ఏపీలో చట్ట ప్రకారమే టీడీపీ నేతల అరెస్టులు జరుగుతున్నాయన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్. చిట్ ఫండ్ సెక్షన్ యాక్ట్ 5 ఆధారంగానే టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ ల అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులు చిట్ ఫండ్ కంపెనీ అవకతవకలే కారణమని ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. దీనిలో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలను అడ్డుపెట్టుకుని టిడిపి నేతలు దోచుకుంటున్నారని, కానీ ప్రజా సంక్షేమం కోసమే సీఐడీ దాడులు చేస్తుందని అన్నారు.

Read Also: DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌కు తప్పిన ప్రమాదం. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..

కాల్ మనీ, ప్రజల దగ్గర నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు. మహానాడు కోసం టిడిపి నేతలను అరెస్టు చేశారనడంపై ఆయన మండిపడ్డారు. మాకేంటి అవసరం ? అని ప్రశ్నించారు. ఆర్థిక నేరగాళ్లు ఉంటే గాని మహానాడు నిర్వహించలేరా? అడిగారు. సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థలను రద్దుచేస్తాం, సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామని మహానాడులో తీర్మానం చేస్తారా..? అంటూ ఎంపీ భరత్ రామ్ ప్రశ్నించారు. చిట్ ఫండ్ అవకతవకాల్లో అరెస్టు అయి రాజకీయం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఆరోపించారు. నేరస్తులు ఎవరైనా ఒక్కరేనని అన్నారు. పొలిటికల్ గా వాడుకోవాలని చూస్తున్నారని, ప్రజలు ఇలాంటివి అన్నీ గమనిస్తున్నారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ అన్నారు.

Read Also: Gorantla Buchiah Chowdary: ఓటమి భయంతోనే వైసీపీ నేతల దాడులు

Exit mobile version