Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honey Trap : ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో దారుణమైన ‘హనీ ట్రాప్’ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అమాయక పురుషులను టార్గెట్ చేస్తూ, పరిచయం పెంచుకుని లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నలుగురు మహిళల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాడితోటకు చెందిన నవీన, సత్యవతి, వెంకటలక్ష్మితో పాటు మరొక మహిళను ఈ కేసుకు సంబంధించి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
రద్దీ ప్రాంతాలే టార్గెట్.. ఫొటోలతో బెదిరింపులు
ఈ ముఠా నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ ఒంటరిగా ఉన్న పురుషులతో మాటలు కలిపేది. వారి నుంచి ఫోన్ నంబర్లు సేకరించి, ఆపై మాయమాటలతో తమ ఇళ్లకు రప్పించేవారు. బాధితులు ఇంటికి రాగానే రహస్యంగా ఫొటోలు తీసి, వాటితో బ్లాక్‌మెయిలింగ్‌కు దిగేవారు. ఎదురుతిరిగితే తమపై అత్యాచారం చేశారంటూ కేసులు పెడతామని తీవ్రంగా బెదిరించేవారు.
Also Read
- YS Jagan : కూటమి పాలనలో పాఠశాల విద్యా రంగం నిర్వీర్యం
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్‌లోకి రావాలి..!
రూ.10 లక్షల వరకు వసూళ్లు.. ఒకే నెలలో మూడు కేసులు
కేసులు, సమాజంలో పరువు పోతుందనే భయంతో బాధితులు రాజీకి రాగా, వారి నుంచి ఈ ముఠా భారీ మొత్తంలో డబ్బులు గుంజినట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ముఠా బాధితుల నుంచి సుమారు రూ. 10 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో గత ఒక నెల వ్యవధిలోనే ఈ ముఠాపై మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. మొదటి కేసులో నిందితులు పూచీకత్తుపై విడుదలైనప్పటికీ, మళ్లీ మిగిలిన రెండు కేసుల్లో పోలీసులు విచారణ వేగవంతం చేసి నలుగురినీ అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం నలుగురికీ రిమాండ్ విధించింది.
కేసు నమోదు.. పోలీసుల హెచ్చరిక
ఈ హనీ ట్రాప్ ముఠా వెనుక ఇంకా ఎవరైనా మాఫియా సభ్యులు లేదా ఇతరులు సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అపరిచితులతో ముఖాముఖి లేదా సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకునేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు గురైతే భయపడకుండా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
-
Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
-
YS Jagan : కూటమి పాలనలో పాఠశాల విద్యా రంగం నిర్వీర్యం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!