NTV Telugu Site icon

Rahul Gandhi: నేడు ఏపీలో ముగియనున్న భారత్‌ జోడో యాత్ర.. మళ్లీ కర్ణాటకలోకి ఎంట్రీ..

Rahul Gandhi

Rahul Gandhi

క‌న్యాకుమారిలో ప్రారంభమై కాశ్మీర్ వ‌ర‌కు సాగుతోన్న భారత్ జోడో యాత్ర.. ఇవాళ మరోసారి కర్ణాటకలోకి ప్రవేశించనుంది… 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3వేల 500 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగేలా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసిన విషయం తెలిసిందే కాగా.. దేశాన్ని ఏక‌సూత్రంతో జోడించ‌డ‌మే యాత్ర ల‌క్ష్యం అంటున్నారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. విభ‌జ‌న రాజ‌కీయాల‌కు వ్యతిరేకంగా, నిరుద్యోగులు, రైతులు, బ‌ల‌హీనవ‌ర్గాల ప‌క్షాన భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు.. కర్ణాటక నుంచి ఇప్పటికే ఓసారి ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చిన ఈ పాదయాత్ర.. మళ్లీ అదే రాష్ట్రంలోకి వెళ్లింది.. ఆ తర్వాత మరోసారి ఏపీలో అడుగుపెట్టిన రాహుల్‌ గాంధీ.. నిన్న మంత్రాలయం చేరుకున్నారు.. గురువారం రోజు ఏపీలోని రాయదుర్గం, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలలో సాగింది జోడో యాత్ర.. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న రాహుల్‌ గాంధీ.. ఇవాళ ఏపీలో తన పాదయత్రను ముగించనున్నారు.

Read Also: Chad: చాద్‌లో దారుణం.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో కాల్పులు..60 మంది మృతి

ఇవాళ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయం సర్కిల్ నుండి రాహుల్‌ పాదయాత్ర ప్రారంభం అయ్యింది.. ఆంధ్రప్రదేశ్‌లో 120 కిలోమీటర్ల మేర సాగింది భారత్‌ జోడో యాత్ర.. ఇక, రాహుల్ గాంధీకి ‌వీడ్కోలు పలకడానికి మంత్రాలయం చేరుకుంటున్నారు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు.. చెట్ట్నే హళ్లి.. మాధవరం మీదుగా కర్ణాటకలో అడుగుపెట్టనున్నారు రాహుల్.. తుంగభద్ర నది వంతెన మధ్యలో ముగియనుంది ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు.. అక్కడే కర్ణాటక నేతలు రాహుల్‌ మరోసారి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం అయ్యారు.. కర్నాటకలోని రాయ్‌చూర్ జిల్లాలోకి రాహుల్ గాంధీ యాత్ర ఎంట్రీ ఇవ్వబోతోంది.. ఈ రోజు, రేపు రాయచూర్‌ జిల్లాలో పాదయాత్ర కొనసాగించనున్నారు రాహుల్‌ గాంధీ.. ఇక, ఎల్లుండి ఉదయం తెలంగాణలోకి ప్రవేశించనుంది భారత్‌ జోడో యాత్ర.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.