NTV Telugu Site icon

Purandeswari: ఆంధ్రాలో అభివృద్ధి ఎక్కడ?

Purandeswari

Purandeswari

ఏపీలో బీజేపీ నేతలు అధికారపార్టీపై దాడి ముమ్మరం చేశారు. ఆత్మకూరులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని వైసీపీ వమ్ము చేసిందన్నారు. నెల్లూరు జిల్లాలో పుష్కలంగా జలవనరులతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిఉన్నా…రైతులు అనధికారికంగా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఏర్పడిందన్నారు.

తుఫాన్ వల్ల నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు, సోమశిల ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం సరికాదన్నారు. ఈ నియోజక వర్గానికి వచ్చిన పరిశ్రమల్ని కూడా కడప జిల్లాకు తీసుకెళ్ళారు. అభివృద్ధి ఆంధ్రా కాదు అప్పులు ఆంధ్రాగా మన రాష్ట్రం తయారైంది. పెట్టుబడిదారులు భయపడుతున్న పరిస్థితి ఉంది. అంతర్జాతీయ మీడియాలో సైతం ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తున్నారు. భూతద్దం పెట్టి వెతికినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కనపడడం లేదన్నారు పురందేశ్వరి.

ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు ఆత్మకూరులో పర్యటిస్తున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్ పోటీలో వున్నారు. మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. బీజేపీ పోటీలో వుంది. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, అందుకే పోటీ చేస్తున్నామంటున్నారు బీజేపీ నేతలు.19వ తేదీన ప్రచారంలో జయప్రద పాల్గొంటారు. 19, 20వ‌ తేదీల్లో బీజేపీ సత్యకుమార్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, 19వ తేదీన బీజేపీ నేత‌ కన్నా లక్ష్మీనారాయణ ప్ర‌చారంలో పాల్గొంటారు. ఈ నెల 20వ తేదిన ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచార కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి ఎల్.మురగన్ హాజ‌ర‌వుతారని బీజేపీ నేతలు తెలిపారు.

Sabitha Indra Reddy : బాసర ట్రిపుల్‌ ఐటీ నిరసనలపై స్పందించిన మంత్రి