YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ

Ys Jagan

Ys Jagan

YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌… ఇవాళ నేడు ఒంగోలులో పర్యటించనున్నారు. దివంగత వైసీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11.40 గంటలకు ఒంగోలు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు కాకుమాను రాజశేఖర్‌ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఒంగోలు నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.

వైసీపీలో కీలకంగా పనిచేసిన కాకుమాను రాజశేఖర్‌ గతంలో లిడ్‌క్యాప్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సెప్టెంబర్‌ 22న డీఎస్సీ నియామకాల్లో అవకతవకలను నిరసిస్తూ విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. అయితే, ఆందోళన సందర్భంగా జరిగిన తోపులాటలో కాకుమాను తీవ్ర ఒత్తిడికి గురై అస్వస్థతకు లోనయ్యారని పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్లిన ఆయన.. అక్కడ తన నివాసంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. మరోవైపు.. కాకుమాను కుటుంబ సభ్యులను ఇప్పటికే ఫోన్‌లో పరామర్శించిన వైఎస్ జగన్‌ వారికి ధైర్యం చెప్పారు. నేడు నేరుగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.