Site icon NTV Telugu

MLA Tatiparthi Chandrasekhar: ఎక్స్‌లో పోస్టు.. వైసీపీ ఎమ్మెల్యేపై కేసు..

Mla Tatiparthi Chandrasekha

Mla Tatiparthi Chandrasekha

MLA Tatiparthi Chandrasekhar: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రాజకీయం మొత్తం సోషల్‌ మీడియా పోస్టుల చుట్టూ తిరుగుతోంది.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశారు పోలిసులు.. ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే చంద్ర శేఖర్ పెట్టిన పోస్ట్‌లపై స్థానిక టీడీపీ నేత కిషోర్ ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. గతంలో.. సర్కారు వారి పేకాటా… రాష్ట్రంలోని పేకాట క్లబ్ ల నుండి వారం వారం కమిషన్ వసూలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కుమారుడు మంత్రి నారా లోకేష్.. విద్యాశాఖ మంత్రిగా ఉంటూ పేకాట ఆడేలా మౌలిక, సాంఘిక వసతులు ఏర్పాటు చేయడం ధర్మమా లోకేష్‌ అంటూ Xలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్వీట్ చేశారు..

Read Also: Hamas : హమాస్‌కు పెద్ద దెబ్బ.. అమెరికా ఒత్తిడి మేరకు ఖతార్ దోహాను విడిచి వెళ్లాలని ఆదేశాలు

అయితే, ఆ ట్వీట్ కు రియాక్షన్ గా గతంలోనే నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా కేసు నమోదు చేసి.. 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని పోలీస్ స్టేషన్లలో పోలీసులు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై పలు కేసులు నమోదు చేశారు. ఎలక్షన్ సమయంలో పెండింగ్ లో ఫిర్యాదులపై సైతం కేసులు నమోదు చేశారని ఎమ్మెల్యే చంద్ర శేఖర్ వాపోతున్నారు.. అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పోస్టింగులకు పెట్టిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తూ వస్తున్న పోలీసులు మొట్టమొదటిసారి ఓ వైసీపీ ఎమ్మెల్యే పైనే కేసులు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.. ఈ విషయంలో వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.. కాగా, సోషల్‌ మీడియాలో అభ్యంతరకరమైన.. మరొకరిని ఇబ్బంది పెట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.. పోస్టులు పెట్టేవారే కాదు.. లైక్‌లు, షేర్‌లు చేసినా.. గ్రూప్‌ అడ్మిన్‌లకు కూడా కష్టాలు తప్పవని వార్నింగ్‌ ఇస్తున్నారు పోలీసులు..

Exit mobile version