NTV Telugu Site icon

Minister Nimmala Ramanaidu: వారి పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం.. 2 ద‌శ‌ల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు..

Nimmala

Nimmala

Minister Nimmala Ramanaidu: జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014-19 మధ్య టీడీపీ పాల‌న‌లో వెలిగొండ ప్రాజెక్టుకు 1373 కోట్ల రూపాయాలు కేటాయించి 96 శాతం ఖ‌ర్చు చేశాం.. కానీ, గ‌త ఐదేళ్లలో జ‌గ‌న్ పాల‌న‌లో 3,518 కోట్ల బ‌డ్జెట్ కేటాయించి కేవ‌లం 170 కోట్లు మాత్రమే ఖ‌ర్చు చేశారని.. జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ట‌న్నెల్స్, ఫీడ‌ర్ కెనాల్, రిజర్వాయర్ ప‌నులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా.. ఒక రూపాయు కూడా ఇవ్వకుండానే ఎన్నికల ముందు వెలిగొండను జాతికి అంకితం చేయటం జగన్ మార్క్ మోసం అని దుయ్యబట్టారు..

Read Also: Mahesh Babu : మహేశ్ ఆ సినిమాలో నటించట్లేదు.. అవన్నీ ఫేక్

రెండో ట‌న్నెల్ లో త‌వ్విన రెండు ల‌క్షల క్యూబిక్ మీట‌ర్ల మ‌ట్టిని మొద‌టి ట‌న్నెల్ చివ‌ర భాగాన పోశారు.. మ‌ట్టిని తొల‌గించ‌కుండా నీరు వ‌ద‌ల‌డం సాధ్యం అవుతుందా..? అని ప్రశ్నించారు నిమ్మల.. రెండో ట‌న్నెల్ 12వ కిలో మీట‌ర్ వద్ద మూడేళ్ల క్రిత‌మే ట‌న్నెల్ బోరింగ్ మెషిన్ పాడైపోతే ఎందుకు బ‌య‌ట‌కు తీయ‌లేక‌పోయారు..? అని నిలదీశారు.. టీబీఎం మెషిన్ బ‌య‌ట‌కు తీయ‌కుండా నీళ్లు ఇవ్వడం సాధ్యమేనా..? రెండు ట‌న్నెల్స్ నుండి 11,500 క్యూసెక్కుల నీరు త‌ర‌లించాల్సి ఉండ‌గా.. క‌నీసం 10 క్యూసెక్కుల నీరు కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి ఏంటంటూ మండిపడ్డారు.. 53 టీఎంసీల సామ‌రథ్యం ఉన్న న‌ల్లమ‌ల‌సాగ‌ర్ లో క‌నీసం అర‌ టీఎంసీ నీరు కూడా నిల్వ చేయ‌లేని ప‌రిస్థితి.. ఏపీలో ఏ ప్రాజెక్టుకు వెళ్లినా జ‌గ‌న్ మోహాన్ రెడ్డి విధ్వంసమే క‌నిపిస్తోంది.. క‌డ‌ప జిల్లాకు చెందిన త‌మ అనుచ‌రుడికి వెలిగొండ హెడ్ రెగ్యులేట‌ర్ ప‌నులు అప్పగించారు.. ప‌నులు పూర్తి చేయ‌కుండానే ఆయన నిధులు తీసుకుని వెళ్లిపోయారని ఆరోపించారు.

Read Also: Union Minister Bandi Sanjay: పగలు, పట్టింపులు పక్కనబెట్టి ఏపీ అభివృద్ధికి సహకరించాలి..

2024 మార్చిలో ప్రాజెక్టుకు భూమిలిచ్చిన రైతుల‌కు నోటీసులు ఇచ్చి స‌భ‌కు రాకుండా అడ్డకున్నారని విమర్శించారు మంత్రి నిమ్మల.. గ‌త ప్రభుత్వంలో ఒక్కరంటే ఒక్కరికైనా పున‌రావాసం చేశామ‌ని చెప్పే ధైర్యం ఉందా..? అని సవాల్‌ చేశారు.. ఒక్క గ్రామానికి కూడా పున‌రావాస కాల‌నీలు నిర్మించి వారిని త‌ర‌లించే ప‌ని చేప‌ట్టలేదు. ఫీడ‌ర్ కెనాల్ అధ్వాన స్దితిలో ఉంది.. దాని నుంచి న‌ల్లమ‌ల సాగ‌ర్ కు నీరు వ‌దిలితే అది ఐదారు చోట్ల తెగి రిజర్వాయర్లోకి చుక్క నీరు చేరదు అన్నారు.. అయితే, రెండు ద‌శ‌ల్లో వెలిగొండ ప్రాజెక్టును వెనువెంటనే పూర్తి చేయాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.. ఫేజ్-1లో హెడ్ వ‌ర్క్స్, రెండు ట‌న్నెల్స్, ఫీడ‌ర్ ఛానెల్, రిజ‌ర్వాయ‌ర్, రెగ్యులేట‌ర్ వంటి నిలిచిన‌పోయిన ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే సీజ‌న్ నాటికి 1.19 ల‌క్షల ఎక‌రాల‌కు నీళ్లు అందించాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు..