CM Chandrababu: ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కనిగిరి నియోజకవర్గంలోని పీసీ పల్లి మండలం లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు.. ఇదే సమయంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలలోని 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు చేశారు.. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు రెండో దశలో ఇవాళ 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ప్రారంభించారు సీఎం చంద్రబాబు.. 587 ఎకరాల్లో మరో 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం శంకుస్థాపనలు చేశారు..
Read Also: Lowest Polling: దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్లోనే అత్యల్ప పోలింగ్..
ఇక, ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కనిగిరి కనకపట్నం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. కనిగిరి కనకపట్నం కావడానికి ఎంతో కాలం పట్టదు అన్నారు.. తుఫానులో సమర్థవంతంగా పనిచేశాం. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పని చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించాం అని పేర్కొన్నారు.. చదువుకుంటున్న విద్యార్థులకు చదువులు పూర్తయ్యలోపు స్థానికంగా ఉపాధి కల్పించే బాధ్యత నాది.. అందరూ ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు.. కానీ, ఇంటికొక వ్యాపారవేత్తని చేస్తామని హామీ ఇచ్చాను. నేను చేసిన పనులే సాక్షాలు అన్నారు.. 25 ఏళ్ల క్రితం అభివృద్ధి ప్రారంభిస్తే హైదరాబాద్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. 17 నెలల నుంచి భిన్నమైన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. చాలా సుడిగుండాల నడుమ పని చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ ని బిల్డప్ చేస్తాం. పెట్టుబడులు తెచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామంటే చాలామంది అవహేళన చేశారని మండిపడ్డారు..
ఈ వారం రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడుల విలువ కొనసాగుతుంది. గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయి. గత పాలకులు చేసిన పనులు బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరూ చేయరు అని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు.. ప్రజా వేదిక కూల్చడంతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది.అన్నీ తెలిసిన డాక్టర్ ని అయిన నాకే నాడి అంతుబట్టడం లేదు. ఒకప్పుడు ఏపీ అంటే ఛీఛీ అనేవాళ్ళు.. ఇప్పుడు ఏపీ అంటే భలేభలే అంటున్నారు. గూగుల్ లాంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయి. లక్షా నలభై వేల కోట్లు గూగుల్ ద్వారా పెట్టు బడులు వస్తున్నాయి. ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్ , నేను కలిసి కూటమి పెట్టాం. కేంద్రం తీసుకొచ్చే పాలసీలను రాష్ట్రానికి తీసుకువస్తున్నా.. పవన్ కళ్యాణ్ కూడా బాగా మద్దతు ఇస్తున్నారు. బాగా చదువుకున్న లోకేష్ కూడా పట్టువదలని విక్రమార్కుడిగా పని చేస్తున్నాడు. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను కానీ… రాబోయే 10 ఏళ్లలో చేయాల్సిన పనులకు శక్తిని, సామర్థ్యాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. 50 ఎంఎస్ఎంఈ పార్క్ లు 87 ప్రాంతాల్లో ప్రారంభించాం. 175 నియోజక వర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను తయారు చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..