Jana Sena: పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా మంగళగిరిలో పవర్ కట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ముగించుకుని మంగళగిరి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోయింది. దీంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం సెల్ ఫోన్ వెలుగులోనే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ మరింత క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానన్నారు. రాజధాని విషయంలో బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించినట్లే.. ఓట్ల చీలిక విషయంలోనూ బీజేపీ హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే ఓట్లను చీలనివ్వకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు పవన్ వివరించారు. ఎవరితో పొత్తులకు వెళ్లాలో మాకు వైసీపీ చెప్పాల్సిన అవసరం లేదని హితవు పలికారు.
MLC Driver Death: రేపు కాకినాడలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన
Also Read
- YSRCP Nomination Row: ఏపీ స్థానిక ఎన్నికలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
- Punganur Violence: పుంగనూరు ఘటనలో.. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 50 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు!
- Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
- TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
మంత్రి పదవులను తాము చెప్పిన వాళ్లకు జగన్ ఇస్తారా అని పవన్ ప్రశ్నించారు. ఓట్లు చీలనివ్వమన్న చిన్న పదానికి వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఇప్పుడే ఏం చెప్పలేనని పవన్ వ్యాఖ్యానించారు. ఎక్కడ పోటీ చేసినా తనను ఓడిస్తామన్న వైసీపీ నేతల ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయని.. తనను విమర్శించిన మాజీ మంత్రులకు ఇప్పటికైనా తెలిసుండాలని ఎద్దేవా చేశారు. తనను తిడితే పదవి కలకాలం నిలవదని వైసీపీ నేతలు గ్రహించే ఉంటారని పవన్ ఆరోపించారు. సీపీఎస్ విధానానికి చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. లక్షల కోట్లు విదేశాలకు తరలించే తెలివితేటలున్నపుడు.. సీపీఎస్ సమస్యను పరిష్కరించే తెలివి తేటలు ఉండవా అని జగన్ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ప్రజలకు దగ్గరయ్యే విధంగా తన యాత్ర ఉంటుందని తెలిపారు. ఇప్పటికే అప్పుపుట్టని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి పూర్తి అవగాహన ఉందని పవన్ అన్నారు.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!