విజయవాడలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నేత వినోద్ జైన్ తనను వేధిస్తున్న విధానాన్ని ఆమె తన పుస్తకంలో రాసినట్టు, సదరు టీడీపీ నేత కూడా బాలిక నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోనే ఉంటునట్లు తెలిసింది. టీడీపీ నేత వినోద్ జైన్ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. అయితే ఆత్మహత్య చేసుకున్న చిన్నారి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు.
చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు వైద్యులు అప్పగించారు. మృతదేహాన్ని చిన్నారి నివాసముండే లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్ వద్దకు కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. లోటస్ లెజెండ్ వద్దకు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చేరుకున్నారు. చిన్నారి బంధువులను.. అపార్ట్మెంట్ వాసులతో మంత్రి వెలంపల్లి మాట్లాడుతున్నారు. 24 గంటల్లో వినోద్ జైన్ ను ఉరి తీస్తేనే చిన్నారి కుటుంబానికి న్యాయం చేసినట్టు అని చిన్నారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిపై న్యాయపరంగా కఠిన శిక్షలు తీసుకునేలా చేస్తామని మంత్రి వెల్లంపల్లి హామీ ఇచ్చారు.