Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం మెగా ప్లాన్..
- 2027 జూన్ నాటికి పూర్తి లక్ష్యం
- కేంద్రం నుంచి రూ.3,300 కోట్ల అదనపు నిధులు
- న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
- పునరావాసం, నిర్మాణ పనులకు వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polavaram Project : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వరప్రదాయిని, జీవనాడి అయిన పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రాజెక్టు నిర్మాణ గడువును 2027 జూన్ నాటికి ఖరారు చేయడంతో పాటు, నిధుల కొరత లేకుండా భారీ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర జలశక్తి శాఖ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే రూ.2,300 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, తాజాగా మరో రూ.3,300 కోట్ల అదనపు నిధుల మంజూరుకు అంగీకరించింది.
ఈ నిధులను వచ్చే సెప్టెంబర్ నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనివల్ల ప్రాజెక్టు పనులతో పాటు పునరావాస కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి.ప్రాజెక్టు పురోగతిపై శుక్రవారం న్యూఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, జల వనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు , ఇతర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు , ముంపు ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించారు.
Also Read
- Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
- CM Chandrababu: సింగపూర్‌లో 'సీబీఎన్@361 డిగ్రీస్' పుస్తకావిష్కరణ!
- Kesineni Nani: కేశినేని నాని వరుస పోస్టులు.. రాజకీయ రీఎంట్రీకి సంకేతాలా?
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో, 194.6 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించేలా తదుపరి కార్యాచరణను కార్యదర్శి కాంతారావు నిర్దేశించారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు రెండో దశ భూసేకరణ , పునరావాస (R&R) ప్యాకేజీ అమలుపై కూడా అధికారులు ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేశారు. ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు స్వయంగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతాలు , ముంపు గ్రామాల్లో పర్యటించారు. పనుల వేగాన్ని, బాధితులకు అందుతున్న పునరావాస సేవలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ మద్దతుతో, దశాబ్దాల నాటి ఆంధ్రుల కల 2027 జూన్ నాటికి సాకారం కానుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
-
Whale Graveyard : నీటి అట్టడుగున 53 లక్షల సంవత్సరాల నాటి తిమింగలాల శ్మశాన వాటిక… ఎక్కడుందో తెలుసా ?
-
Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
-
CM Chandrababu: సింగపూర్‌లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకావిష్కరణ!
-
Kanatha Kaanom OTT Release : ఓటీటీలోకి యోగి బాబు తమిళ కామెడీ.. తెలుగులోనూ చూడవచ్చు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?