Onion Prices Fall: ఉల్లి ధర పతనం.. అన్నదాతల కన్నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధర రూ.20 నుంచి రూ.30 వరకు పలుకుతుంటే.. మరోవైపు.. గిట్టు బాటు ధర లేక.. రైతులు పంటను ధ్వంసం చేసే పరిస్థితి నెలకొంది.. కర్నూలు జిల్లాలో ఉల్లి దిగుబడులు మొదలయ్యాయి. ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డుకు తరలి వస్తోంది. దిగుబడి కూడా సంతృప్తికరంగానే ఉంది. అయితే ఉల్లి ధర పడిపోయింది. రైతుల నుంచి క్వింటాలు ఉల్లి 400 నుంచి 800 పలుకుతోంది. వినియోగదారులకు వ్యాపారులు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. ఉల్లి గిట్టుబాటు ధర పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఎకరాకు 60 వేలకు పైగానే ఉందని, ఇప్పటి ధర పెట్టుబడికి కూడా రావడం లేదంటున్నారు. దళారులు ఉల్లి ధర రైతులకు దక్కకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Read Also: Colleague Hugging: కౌగిలించుకున్నాడంటూ కోర్టుకెక్కిన మహిళ.. భారీ జరిమానా విధించిన న్యాయమూర్తి..
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
కర్నూలు జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో లక్ష ఎకరాల వరకు ఉల్లి సాగవుతుంది. ఇతర రాష్ట్రాలకు కర్నూలు జిల్లా నుంచి ఉల్లి ఎగుమతవుతుంది. రైతులకు ఎప్పుడో ఒకసారి కానీ మంచి ధర దక్కదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత ధర పడిపోతుందేమోనన్న భయం రైతుల్లో ఉంది. ఇప్పటికే కర్నూలు మార్కెట్‌కు రోజుకు 1300 క్వింటాళ్ల ఉల్లి వస్తోంది. కనిష్ట ధర 415 కాగా గరిష్ట ధర 1150 వుంది. గరిష్ట ధర దక్కేది ఏ ఒకరిద్దరు రైతులకు మాత్రమే దక్కుతుంది. మెజారిటీ రైతులకు దక్కేది 800 రూపాయల లోపే.. ఉల్లి గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలంలోనే పంటను తొలగిస్తున్నారు. దేవనకొండ మండలంలో ఓ రైతు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని ఉల్లి సాగు చేసాడు. పండిన ఉల్లిని కోసి, గ్రేడింగ్ చేసి, ట్రాక్టర్ లో మార్కెట్ కు తరలిస్తే.. కూలీలు, రవాణా ఖర్చు కనీసం 3 లక్షలు వ్యయం అవుతుంది. మార్కెట్ లో సరుకు అమ్మితే 2 లక్షలు కూడా చేతికి రాదు. దీంతో 12 వేలు ఖర్చు పెట్టి ఉల్లి పంటను ట్రాక్టర్ తో దున్నించాడు. ఉల్లిపంట అత్యధికంగా సాగు చేసేది కర్నూలు జిల్లాలోనే. గిట్టుబాటు ధర కల్పించాలని ప్రతి ఏటా రైతులు కోరుతూనే ఉన్నారు. నష్టపోతూనే వున్నారు. ఇప్పటికైనా ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!