Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- ఇంచార్జ్ పదవి పోయినా వర్మ చుట్టూ నేతల రద్దీ
- 54 గ్రామాల నుంచి కాకినాడకు చేరిన కార్యకర్తలు
- వర్మ తీరుపై జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి?
- ‘నేను పిలవలేదు.. అభిమానులే వస్తున్నారు’ : వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిఠాపురం నియోజకవర్గ రాజకీయం మరోసారి వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు నియోజకవర్గంలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ పదవి నుంచి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వర్మను తప్పించిన సంగతి తెలిసిందే. పార్టీ నిర్ణయంతో ఆయన అధికారికంగా నియోజకవర్గ బాధ్యతలకు దూరమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో రాజకీయాలు మాత్రం కాకినాడ కేంద్రంగా జోరుగా సాగుతున్నాయి.
పదవి పోయినప్పటి నుండి వర్మ అనుచరులు, స్థానిక టీడీపీ నేతలు భారీ సంఖ్యలో కాకినాడకు తరలివెళ్లి ఆయనను కలుస్తున్నారు. నియోజకవర్గంలోని దాదాపు 54 గ్రామాల నుంచి కార్యకర్తలు, నాయకులు మండలాల వారీగా కాకినాడలోని వర్మ నివాసానికి చేరుకుని, తమ మద్దతు తెలియజేస్తూ ఆయనను ఓదారుస్తున్నారు. అక్కడ వారంతా కలిసి నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చిస్తుండటం విశేషం.
Also Read
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
అయితే, వర్మ కాకినాడలో ఉంటూ పిఠాపురం రాజకీయాల్లో ఈ విధంగా జోక్యం చేసుకోవడంపై మిత్రపక్షమైన జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గానికి దూరం చేసినా వర్మ కావాలనే తన అనుచరులతో హడావుడి సృష్టిస్తున్నారని జనసేన శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కూటమి ధర్మానికి విరుద్ధంగా సమాంతర రాజకీయాలు నడపడం సరికాదనే భావన జనసేనలో కనిపిస్తోంది.
ఈ వివాదంపై మాజీ ఎమ్మెల్యే వర్మ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. తానేమీ పిఠాపురం నుండి ఎవరినీ రమ్మని ప్రత్యేకంగా పిలవడం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం తనపై ఉన్న పాత అభిమానంతోనే కార్యకర్తలు, ప్రజలు తనను కలవడానికి వస్తున్నారని పేర్కొన్నారు. తనను నమ్ముకుని ఇంటికి వచ్చిన వారిని వెనక్కి వెళ్ళిపొమ్మని తిరస్కరించలేనని, అభిమానులను కలుసుకోవడం తప్పు కాదని వర్మ సమర్థించుకుంటున్నారు. ఏదేమైనా పిఠాపురంలో వర్మ నడుపుతున్న ఈ ‘ఓదార్పు రాజకీయం’ కూటమి వర్గాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
-
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!