Perni Nani : మంచి కబురు వింటామని ఆశిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లాకు చెందిన కొందరు మత్య్సకారులు ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వారికోసం అధికారం యంత్రాంగం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో గల్లంతైన మత్స్యకారుల ఇళ్లకు వెళ్లి బాధితులను మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచారం అందిన వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఆయన వెల్లడించారు. నిన్నటి నుంచి హెలికాప్టరులో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని, బోట్ల ద్వారా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికమైన డార్నియర్ ఫ్లైటు ద్వారా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు.
కోల్‌కతా వరకు గాలించేందుకు చర్యలు చేపట్టినట్లు, సాయంత్రంలోగా మంచి కబురు వింటామని ఆశిస్తున్నామన్నారు. అయితే.. ఇప్పటికే గల్లైంతన వారి ఫోన్ లోకేషన్ ట్రేస్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఫోను ఐఎంఈఐకి ఐటీ కోర్ నుంచి బ్లాంక్ మెసేజ్‌ను పోలీసులు పంపారు. నిన్న ఉదయం బ్లాంక్ మెసేజ్ పంపితే.. రాత్రి పదకొండు గంటలకు మెసేజ్ డెలివరీ అయినట్టు సమాచారం. బ్లాంక్ మెసేజ్ డెలివరీ కావడంతో మత్స్యకారుల జాడ తెలుస్తుందని జిల్లా యంత్రాంగం ఆశిస్తోంది. ఇవాళ కూడా ఛాపర్ ద్వారా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. చెన్నై నుంచి కాసేపట్లో నేవీ అధికారులు ఛాపర్ ద్వారా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించనున్నారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!