Perni Nani Strong Counter To Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపిస్తే, తాను రెండు చెప్పులు చూపిస్తానంటూ మాజీమంత్రి పేర్ని నాని ఓ మీడియా సమావేశంలో రెండు చెప్పులు చూపించడంపై.. జనసేనాధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో వ్యంగ్యంగా స్పందించారు. అన్నవరం సత్యనారాయణ ఆలయానికి వెళ్లినప్పుడు తన రెండు చెప్పులు ఎవరో దొంగలించారని, అందుకే షూ వేసుకొని వచ్చానంటూ సెటైర్లు వేశారు. అందుకు తాజాగా పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. పవన్ పార్టీ సింబర్ గాజు గ్లాసు పోయి చాలాకాలం అవుతోందని, అలాంటిది మూడు రోజుల క్రితం పవన్ చెప్పులు పోతే కంగారేముందని ఎద్దేవా చేశారు. చెప్పులు పోతే ఎవరో ఒక సినిమా ప్రొడ్యూసర్ కొనిస్తాడని.. ముందు నీ పార్టీ సింబల్ పోయింది, అది చూస్కో అని హితవు పలికారు. 9 నెలల క్రితం అక్టోబర్ 18న లింగమనేని రమేశ్ కట్టించిన గుడికి వెళ్లినప్పుడు, తన చెప్పు కూడా పోయిందని గుర్తు చేసుకున్నారు. ఆ గుడికి దగ్గరలోనే పవన్‌కి లింగమనేని అమ్మిన స్థలంలో పార్టీ ఆఫీస్ ఉంది కదా అని, ఆ చెప్పు పవన్ తీశామని అవమానించలేం కదా? అని పరోక్షంగా సెటైర్లు వేశారు. అయినా.. తనకు చెందిన ఒక్క చెప్పును తీసుకెళ్లి, పవన్ ఏం చేసుకుంటాడు? అంటూ చురకలంటించారు.
Hero Vijay: రాజకీయాలపై హీరో విజయ్ సెటైర్లు.. డబ్బు తీసుకుని ఓటేస్తే..
అంతకుముందు ఓ మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ.. ఒక చెప్పు చూపిస్తేనే పెద్ద మొగోడినని పవన్ అనుకుంటున్నాడని, రెండు చెప్పులు చూపిస్తున్న తాను పవన్ కంటే పెద్ద మొగోడినంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తన లారీ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని.. లారీకి వారాహి అని అమ్మవారి పేరు పెట్టి రాజకీయాలకు వాడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలకుల చొక్కా పట్టుకున్నానని చెప్తున్న పవన్.. ఎన్నిసార్లు చంద్రబాబు, మోడీ చొక్కా పట్టుకున్నారని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఉన్నప్పుడు.. జీఎస్టీ లేదా? అప్పుడు సినిమా టికెట్లపై టాక్స్ లేదా? అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ చెప్పిన ప్రతీ ఒక్కమాట అబద్ధమేనని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన యాత్ర వారాహి యాత్ర కాదని, అది నారాహి యాత్ర అని.. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని, టీడీపీ కోసం కొత్త డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు వ్యూహాల్ని పవన్ నమ్ముకుంటే అసెంబ్లీకి వెళ్లలేరని.. ప్రజలను నమ్ముకుంటేనే అసెంబ్లీలో అడుగుపెడతారని సూచించారు.
Adapa Seshu: చంద్రబాబు కోసం పవన్ ముసుగు యాత్రలు చేస్తున్నారు