NTV Telugu Site icon

Perni Nani: పవన్‌ని సినిమాల్లో తప్ప బయట ఎవరినీ కొట్టలేడు.. పేర్ని నాని కౌంటర్

Perni Nani On Pk

Perni Nani On Pk

Perni Nani Counter Attack On Pawan Kalyan: తనకు ప్రాణహాని ఉందంటూ జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రాణహాని అంటూ పవన్‌ సొల్లు కబుర్లు చెబుతున్నాడంటూ ఆయన ధ్వజమెత్తారు. తనకు నిజంగా ప్రాణహాని ఉంటే.. ఏనాడైనా పోలీసులకు ఫిర్యాదు చేశాడా? అని ప్రశ్నించారు. ఆయనకు చంద్రబాబు వల్లే ప్రాణహాని ఉందని ఆరోపించారు. బట్టలూడదీసి కొడతానని పవన్ అంటున్నాడని.. ఆయన సినిమాల్లో తప్ప, బయట ఏ ఒక్కరినీ కొట్టలేడని దుయ్యబట్టారు. తన దగ్గర పనిచేసే సిబ్బందిని మినహాయిస్తే, పవన్ ఎవడ్ని కొట్టలేడంటూ ఎద్దేవా చేశారు. అరాచకంగా పాలించిన చంద్రబాబుని పవన్ ఏనాడైనా కొట్టాడా అని నిలదీశారు. లోకేష్ అవినీతిపరుడని పవన్ గతంలో ఆరోపించారని, మరి అప్పుడు లోకేష్‌ని గుడ్డలిప్పి పవన్ కొట్టగలిగాడా? అని అడిగారు. పవన్‌ది రౌడీ మనస్తత్వమని, అందుకే అలా మాట్లాడుతున్నాడని అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబుతో పవన్‌ కలిసిపోవడం ఖాయమని.. సీఎం జగన్‌ను ఎదుర్కోవడం​పవన్‌ వల్ల కాదు అని పేర్ని నాని పేర్కొన్నారు.

Miss Universe Titles: అత్యధిక మిస్ యూనివర్స్ టైటిల్స్ నెగ్గిన టాప్-10 దేశాలు

ఇదే సమయంలో డిప్యూటీ సీఎం మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. తనకు ఏదైనా జరిగితే.. ఆ నెపాన్ని వైసీపీ మీదకు నెట్టి, రాజకీయంగా లబ్ధి పొందేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. పవన్‌ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, వారాహి యాత్ర పేరుతో అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని పవన్ ఎందుకన్నారో తెలియదని.. అయితే అది చంద్రబాబు నుంచే ఉందని గ్రహించాలని సూచించారు. చంద్రబాబుపై పవన్ ఓ కంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండాలన్నారు. పవన్‌ పాలిచ్చే ఆవును వదిలేసి, తన్నే దున్నపోతు లాంటి చంద్రబాబును విశ్వసిస్తున్నారని అన్నారు. స్థిరత్వం లేని మాటలతో ప్రజల్లో చులకన కావొద్దని హితవు పలికారు. గతంలో తనకు ముఖ్యమంత్రి అయ్యే సీన్‌ లేదని చెప్పిన పవన్‌.. ఇప్పుడు ఆ పదవి చేపట్టడి కోసం సిద్ధంగా ఉన్నానని చెప్పడం విడ్డూరమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించగలరా అని చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. గుంట నక్క లాంటి చంద్రబాబుని, ఆయనతో ఉన్నందుకు పవన్‌ని ఓడించాలని ప్రజలు అనుకుంటున్నారన్నారు.

Health Tips: ఈ సంకేతాలు మీరు ఎక్కువగా ఉప్పు తింటున్నట్లు చూపుతాయి, వెంటనే తగ్గించుకోవాలి.